Rahul Gandhi: అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ.. నిరుద్యోగులతో చిట్ చాట్.. వీడియో..
పోలింగ్ డేట్ దగ్గరపడటంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వరుస సమావేశాలు, సభలతో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన రాహుల్ గాంధీ పగలంతా సభలు, రోడ్‌షోలో పాల్గొంటున్నారు. రాత్రిపూట పార్టీనేతలతో సమావేశాలు, నిరుద్యోగ యువతను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పోలింగ్ డేట్ దగ్గరపడటంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వరుస సమావేశాలు, సభలతో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన రాహుల్ గాంధీ పగలంతా సభలు, రోడ్‌షోలో పాల్గొంటున్నారు. రాత్రిపూట పార్టీనేతలతో సమావేశాలు, నిరుద్యోగ యువతను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని అశోక్‌నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతోన్న నిరుద్యోగులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. యువకుల సమస్యలు అడిగి తెలసుకున్నారు. వాళ్లు చెప్తున్న బాధలన్నింటినీ ఓపికగా విన్నారు. వారి బాధలు తన మనసును కలిచివేశాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక..అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నిరుద్యోగులతో కలిసి రాహుల్ గాంధీ చిక్కడపల్లిలోని బావార్చి హోటల్‌లో బిర్యానీ తిన్నారు.
రాహుల్ షెడ్యూల్..
ఇదిలాఉంటే.. రాహుల్ గాంధీ ఈరోజు 4 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఆందోల్, సంగారెడ్డి, కామారెడ్డిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 11:30AMకి ఆందోల్, 12:45PMకి సంగారెడ్డి, 2:30PMకి కామారెడ్డిలో రాహుల్ ప్రచారం నిర్వహిస్తారు.
వీడియో చూడండి..
మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేస్తారు. నారాయణ్‌పేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు.
ఈరోజు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న యువతను నేను కలిశాను.
తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి పదేళ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసింది.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు… pic.twitter.com/GzayJriQY8
— Rahul Gandhi (@RahulGandhi) November 25, 2023
వరుస సభలు, రోడ్‌షోలతో తెలంగాణను చుట్టేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఆరు గ్యారంటీలపై ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ హామీనిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




