Telangana Elections: వాళ్లిద్దరూ కార్పొరేట్ నాయకులే.. ఎవరికి ప్రయోజనం.. ఎన్నికల వేళ మావోయిస్టుల సంచలన లేఖ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ తరుణంలో ఖమ్మం రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓ వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ తరుణంలో ఖమ్మం రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓ వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. ప్రచారంలో దూసుకెళ్తూ.. పువ్వాడ అనుచరులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై మావోయిస్టులు లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ ఇద్దరూ కార్పొరేట్ రాజకీయ నాయకులే.. అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) భద్రాద్రి కొత్తగూడెం -అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ లేఖ విడుదల చేసింది. ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో ఆధిపత్యం కోసం అజయ్, శ్రీనివాసరెడ్డి.. ఇద్దరు నాయకులు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు.. ఈ ఎన్నికలు ఎవరికి ప్రయోజనం ఎవరి కోసం.. దొంగ ఓట్ల.. దొంగ నోట్ల రాజ్యానికి బుద్ది చెప్పాలంటే ఈ ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తోందంటూ కోరారు. ఇద్దరూ తమ ఎజెంట్లను గెలిపించుకునేందుకు పోటీ పడుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల కోలాహలం నెలకొందని.. మాదే గెలుపంటే మాదే గెలుపని ప్రధాన పార్టీలు రెండు తీవ్రంగా పోటీ పడుతూ ఆరోపణలు, ప్రత్యా రోపణలతో జనాలను గందరగోళానికి గురిచేస్తున్నారు. మాయమాటలు, అమలుకు వీలుకాని హామిలతో మేనిఫెస్టో తయారు చేసి ఒకరికి మించి మరొకరు ఉచితాలను ఇస్తామంటూ పోటీపడుతున్నారు. చిత్తశుద్ధిలేని హామీలతో మరో మారు ప్రజలను మోసం చేసేందుకు సిద్దమయ్యారు. 76 సంవత్సరాల స్వతంత్ర్య భారతంలో నేటికి ప్రజల బ్రతుకుల్లో ఎలాంటి మార్పూ లేదంటూ ఆజాద్ లేఖలో తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
