AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaddar Daughter Vennela: కాంగ్రెస్‌పై నమ్మకం ఉంది.. టికెట్ ఇవ్వకపోతే.. గద్దర్ కూతురు వెన్నెల సంచలన వ్యాఖ్యలు..

Telangana Elections: తమ కుటుంబంలో ఎలాంటి చీలికలు లేవని టీవీ9తో చెప్పారు గద్దర్‌ కూతురు వెన్నెల. కాంగ్రెస్‌ పార్టీ తమకు అండగా ఉందని.. కంటోన్మెంట్‌ టికెట్‌ ఇస్తారన్న నమ్మకం ఉందంటూ వెన్నెల పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి కంటోన్మెంట్‌ టికెట్‌ ఆశిస్తున్న వెన్నల శనివార మాట్లాడారు. తమ కుటుంబంలో ఎలాంటి చిలికలు లేవని.. అంతా ఒక్కటే కుటుంబంగా ఉన్నామని తెలిపారు.

Gaddar Daughter Vennela: కాంగ్రెస్‌పై నమ్మకం ఉంది.. టికెట్ ఇవ్వకపోతే.. గద్దర్ కూతురు వెన్నెల సంచలన వ్యాఖ్యలు..
Gaddar Family
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Oct 21, 2023 | 5:47 PM

Share

Telangana Elections: తమ కుటుంబంలో ఎలాంటి చీలికలు లేవని టీవీ9తో చెప్పారు గద్దర్‌ కూతురు వెన్నెల. కాంగ్రెస్‌ పార్టీ తమకు అండగా ఉందని.. కంటోన్మెంట్‌ టికెట్‌ ఇస్తారన్న నమ్మకం ఉందంటూ వెన్నెల పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి కంటోన్మెంట్‌ టికెట్‌ ఆశిస్తున్న వెన్నల శనివార మాట్లాడారు. తమ కుటుంబంలో ఎలాంటి చిలికలు లేవని.. అంతా ఒక్కటే కుటుంబంగా ఉన్నామని తెలిపారు. కాంటోన్మెంట్ టికెట్ ను కాంగ్రెస్ మాకు కేటాయిస్తుంది అనే నమ్మకంతో ఉన్నామని.. గద్దర్ మృతి చెందే వరకు కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉందని వివరించారు. ఇప్పుడు టికెట్ ఇచ్చే విషయంలో తమతో ఎవరు సంప్రదింపులు జరుపలేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని.. టికెట్ ఇవ్వకపోతే అభిమానులు కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని, తదుపరి కార్యచరణను అప్పుడే స్పష్టంచేస్తామని తెలిపారు.

కంటోన్మెంట్ లో పుట్టి పెరిగానని.. ఈ ఎన్నికల్లో పోటీలో ఉంటానంటూ వెన్నెల తెలిపారు. చాలా మంది అడుగుతున్నారు.. పోటీలో ఉంటారా అని అందుకే క్లారిటీ ఇస్తున్నానన్నారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుండి పోటీ చేస్తానని.. కాంగ్రెస్ తన పేరును పరిశీలిస్తుందని తెలిపారు. గద్దర్ కూతురుగా మీ ముందుకు వస్తున్నానని.. ఓట్ల విప్లవం రావాలని గద్దర్ అన్నారన్నారు. అందుకే చివరగా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారంటూ వివరించారు.

వీడియో చూడండి..

గద్దర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటూ చెప్పారని.. గద్దర్ భార్య విమల వివరించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తామన్నారు.. తరువాత చప్పుడు చేయట్లేదని.. అందుకే కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న టిక్కెట్ ఇవ్వాలని..నా కూతురును ప్రజలు గెలిపిస్తారంటూ విమల వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..