Akula Lalitha: బీఆర్ఎస్ కు మహిళార్థికాభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రాజీనామా

Telangana Assembly Elections: నిజామాబాద్‌ జిల్లాలో అధికార పార్టీలో కదుపు మొదలైంది. బోధన్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పద్మా శరత్‌రెడ్డి దంపతులు పార్టీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరిపోయారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మహిళార్థికాభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఆకుల లలిత బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. తన కార్యకర్తలతో సమావేశం అనంతరం భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. మరోవైపు తిరిగి సొంత గూటికి చేరుతారన్న ప్రచారం జోరందుకుంది.

Akula Lalitha: బీఆర్ఎస్ కు మహిళార్థికాభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రాజీనామా
Akula Lalitha
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 17, 2023 | 11:58 AM

నిజామాబాద్‌ జిల్లాలో అధికార పార్టీలో కదుపు మొదలైంది. బోధన్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పద్మా శరత్‌రెడ్డి దంపతులు పార్టీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరిపోయారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మహిళార్థికాభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఆకుల లలిత బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. తన కార్యకర్తలతో సమావేశం అనంతరం భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. గత ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఆకుల లలిత.. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా మళ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీని వీడి.. తిరిగి సొంత గూటికి చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. అక్టోబర్ 20 నుంచి నిజామాబాద్ జిల్లాలో రాహుల్‌ పర్యటన నేపథ్యంలో మరిన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు.

ఆకుల లలిత కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన లీడ‌ర్…రాష్ట్ర మ‌హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు..ఓసారి డిచ్‌ప‌ల్లి ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ప‌ని చేసిన అనుభ‌వం ఆమెది…బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం నుంచి రావ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టిక్కెట్ పై ఆర్మూరులో నిలబడ్డారు.. కానీ, ఏదో కారణంతో..చివ‌రి నిమిషంలో ప్రచారం నుంచే ఆమె మాయమయ్యారు..అయితే అప్పట్లో..జీవ‌న్ రెడ్డి తో ఒప్పందంలో భాగంగానే ఆఖరు నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారనే ప్రచారం కాంగ్రెస్‌లో బాగా జరిగింది..దానికి బలం చేకూర్చుతూ.. ఎన్నికల తర్వాత.. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉంటూనే కారెక్కేశారు.. దీంతో.. ఈ ప్రచారం కూడా నిజమేననుకున్నారు. కానీ ఇక్కడే కారు పార్టీ లలితకు అనుకోని షాక్‌ ఇచ్చింది..

ఎమ్మెల్సీగా ఉండగానే టిఆర్ఎస్ లో చేరిన ఆకుల లలిత మ‌ళ్లీ ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తామన్న హ‌మీ మేర‌కే కారెక్కారట..కానీ లలితకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వకుండా..టీఆర్‌ఎస్‌ రెండేళ్లు ఖాళీగా కూర్చోబెట్టింది..తీవ్ర మనస్తాపం చెందిన లలిత చాలా సార్లు కారు దిగాలని అనుకున్నారట. ఇది తెలిసిన అధిష్టానం..నిజామాబాద్ జిల్లాలో బ‌ల‌మైన సామ‌జిక వ‌ర్గం నేత కాబ‌ట్టి ఆ ఇంపాక్ట్ పార్టీపై ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని గ్రహించి వెంట‌నే మ‌హిళా కార్పొరేషన్‌ చైర్ ప‌ర్సన్‌గా అవ‌కాశం ఇచ్చారు.. ఇప్పుడామె ఆ పదవిపైనా కొంత కాలంగా నిరుత్సాహంగా ఉన్నారు. త‌న‌ను ప్రత్యక్ష రాజ‌కీయాల నుంచి దూరం చేశారని అనుచరులతో వాపోతున్నారట. అందుకే మళ్లీ రూటు మారుస్తున్నట్లు ప్రకటించారు. కారు దిగి ఖాళీ అయ్యారు.

ఎన్నికల వేడి స్టార్ట్ కావడంతో..ఆకుల లలిత మళ్లీ బరిలో దిగేందుకు రెడీ అయ్యారు.. ఇది వ‌ర‌కు ఆమె ప్రాతినిధ్యం వ‌హించిన డిచ్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు రూర‌ల్ గా మారింది. దీనికి తోడు అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేకే మరోసారి టికెట్ కట్టబెట్టారు సీఎం కేసీఆర్. దీంతో.. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తనకు అవకాశం కల్పిస్తుందనుకున్న బీఆర్ఎస్‌ అధిష్టాన నిరుత్సాహపరిచింది. అందుకే పాత పరిచయాలను అప్‌డేట్‌ చేస్తున్నారట. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేందుకు.. అధిష్టానంతో కూడా చర్చించారు. గతంలో పోటీ చేసిన ఆర్మూరులో బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌కు కూడా ఇప్పుడు లీడర్‌ అవసరమేనని.. ఆ గట్టుపైనా ఓ కాలేశారట.. అందుకే ఆర్మూరు నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసేందుకూ ఇన్‌సైడ్‌ లాబీయింగ్‌ చేస్తున్నారట. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తరపున ఆర్మూరులో పోటీ చేసిన లలితకు.. అప్పటి క్యాడర్‌ కూడా టచ్‌లో ఉండటంతో..అదే బెటర్‌ ఆప్షన్‌ అనే యోచనలో ఉ న్నారట..ఇదివరకే ఒకసారి హ్యాండిచ్చిన బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు.

మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని వస్తే.. కారులో ఇమడలేకపోయారు లలిత. మరి మళ్లీ సొంతింటికి వస్తానంటున్న కాంగ్రెస్‌ నమ్ముతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..