Telangana Election Polling: పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ.. సెల్ఫీ వీడియో తీసిన ఓటరుపై కేసు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పండుగ ప్రశాంతంగా జరగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల కంటే పల్లెల్లోని ఓటర్లు పెద్ద ఎత్తున్న తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈసారి కొత్త ఓటర్లు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి ఓటర్లుగా ఎన్‌రోల్ చేసుకున్న యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పండుగ ప్రశాంతంగా జరగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల కంటే పల్లెల్లోని ఓటర్లు పెద్ద ఎత్తున్న తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈసారి కొత్త ఓటర్లు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి ఓటర్లుగా ఎన్‌రోల్ చేసుకున్న యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తొలిసారిగా ఓటు హక్కును ఉపయోగించుకునే యువత ఓటు వేసే విషయంలో చాలా ఉత్సాహం చూపుతున్నారు. యువతీ యువకులు తాము ఓటు వేసి, తాము ఓటు హక్కును వినియోగించుకున్నామని చెప్పే ప్రయత్నంలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ హడావిడి చేస్తున్నారు. తమ వేలికి వేసి ఉన్న సిరా చుక్కను చూపెడుతూ ఫోటోలు, వీడియోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కోదాడ నియోజకవర్గం పరిధిలోని నడిగూడెం మండలంలోని కాగితపు రామచంద్రపురం గ్రామంలో ఒక వ్యక్తి అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఓటు వేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది అటు ఇటూ తిరిగి ఎన్నికల కమిషన్‌కు చేరింది. సదరు ఓటరుపై కేసు చేసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
ఓటు హక్కును వినియోగించుకుంటూ పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తున్న సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సప్ స్టేటస్ పెట్టాడు ఆ యువకుడు. దీంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘన క్రింద కేసు నమోదు చేశారు అధికారులు.
పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్ నిషేదం
భారత ఎన్నికల సంఘం నియమాళి ప్రకారం… ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్ తీసుకు వెళ్ళడానికి అనుమతి లేదు. అంతేకాదు సెల్ఫీ తీసే ప్రయత్నం చేస్తే అరెస్టు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక ఆ ఓటు కూడా లెక్కించరు. పోలింగ్ కేంద్రంలో కెమెరాలతో కూడా ఎవరూ ఫోటోలు తీయకూడదని సూచిస్తుంటారు ఎలక్షణ్ కమిషన్. తాము ఓటు వేసినట్టు సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం మంచిదే. దీనివల్ల మిగతా వారిలో కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే చైతన్యం వస్తుంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్దకు ఫోన్లను అనుమతిస్తే మాత్రం వారితో తలనొప్పే అని భావించిన ఎన్నికల సంఘం ఈ నిబంధనలను విధించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ క్లిక్ చేయండి..
తెలంగాణ ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి