Telangana Election: అక్కడ ఎన్నికల సమరంలో సై అంటున్న జిల్లా సారధులు.. పశ్చిమంలో పాగా ఎవరిదో..?
సహజంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రధాన రాజకీయ పార్టీలలో అభ్యర్థులు బరిలో ఉంటారు. వారికి పార్టీ అధ్యక్షులు వెన్ను తట్టి ప్రోత్సహిస్తు గెలుపు కోసం సారథ్యం వహిస్తుంటారు. అన్ని తానై జిల్లా అధ్యక్షులు ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తుంటారు.. కానీ వరంగల్ జిల్లాలో రాజకీయాలు కాస్త డిఫెరెంట్. పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం విచిత్ర పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మూడు ప్రధాన రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులే సమరంలోకి దిగారు.
పోరాటాల పురిటగడ్డ ఓరుగల్లు గడ్డపై ఆసక్తికరమైన పోటీ నెలకొంది. అక్కడ జిల్లా సారధులే సమరంలో సై అంటున్నారు. పరస్పర విమర్శలతో కాక రేపుతూ.. గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ ముగ్గురిలో ఎవరి బలమెంతా..? బలగమెంతా..! అంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
సహజంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రధాన రాజకీయ పార్టీలలో అభ్యర్థులు బరిలో ఉంటారు. వారికి పార్టీ అధ్యక్షులు వెన్ను తట్టి ప్రోత్సహిస్తు గెలుపు కోసం సారథ్యం వహిస్తుంటారు. అన్ని తానై జిల్లా అధ్యక్షులు ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తుంటారు.. కానీ వరంగల్ జిల్లాలో రాజకీయాలు కాస్త డిఫెరెంట్. పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం విచిత్ర పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మూడు ప్రధాన రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులే సమరంలోకి దిగారు. యాదృచ్ఛికంగా జరిగిందా..? లేక పక్కాగా లెక్కలు చూసి టిక్కెట్లు కట్టబెట్టారో తెలియదు కానీ, మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ముగ్గురు జిల్లా పార్టీ అధ్యక్షులనే బరిలోకి దింపారు.. దీంతో పోటీ రసవత్తరంగా మారింది..
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ దాస్య వినయ్ భాస్కర్ మరోసారి బరిలోకి దిగారు. ఇప్పటికే నాలుగు పర్యాయాలు గెలిచిన ఆయన ఐదవ సారి గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రచారం నిర్వహిస్తూ జనం దృష్టి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. తాను చేసిన అభివృద్దే తనను గెలిపిస్తుందనే విశ్వాసంతో ఉన్నారు ఆయన.
కాంగ్రెస్ నుండి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం బరిలోకి దింపింది. 35 ఏళ్ల నుండి కాంగ్రెస్ పా లోనే పనిచేస్తున్న నాయిని రాజేందర్ రెడ్డికి మొట్ట మొదటిసారి పార్టీ బీ-ఫామ్ దక్కింది. ఖచ్చితంగా గెలుస్తాననే కాన్ఫిడెన్స్ ఉన్నారు ఆయన. ఇక బీజేపీ నుండి జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మా అమరేందర్ రెడ్డికి పార్టీ అధిష్టానం టిక్కెట్ కట్ట బెట్టింది. గత పదేళ్ల నుండి నగరంలో పట్టు సాధించిన రావు పద్మా అమరేందర్ రెడ్డి ఈసారి గెలుపు నాదే అనే విశ్వాసం తో ఉన్నారు.
ముగ్గురు జిల్లా సారదుల మధ్య పోటీ జనంలో చర్చగా మారింది. ఎవరి వారు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. నేరుగా కార్యకర్తలతో సత్సంబంధాలు ఉండటంతో జనంలోకి దూసుకుపోతున్నారు. అయితే, విజ్ఞాన వంతులైన వరంగల్ పశ్చిమ ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారో వేచి చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…