AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryapet: ఎంతకు తెగించారు.. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో దాడి..

పాత కక్ష్యలతో ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు వెంటాడి గాయపరిచారు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండా దాడికి తెగబడ్డారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా గురువారం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం..

Suryapet: ఎంతకు తెగించారు.. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో దాడి..
Suryapet Crime
Srilakshmi C
| Edited By: |

Updated on: Jun 30, 2023 | 3:27 PM

Share

సూర్యాపేట: పాత కక్ష్యలతో ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు వెంటాడి దారుణంగా గాయపరిచారు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వెంటాడి దాడికి పాల్పడ్డారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా గురువారం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సూర్యాపేట మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ అలియాస్‌ బంటి, మహేశ్‌, సన్నీ కలిసి తాళ్లగడ్డకు చెందిన చీకూరి సంతోష్‌తో పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాటువేసి సంతోష్‌ను ఆ ముగ్గురూ అడ్డగించారు. అందరూ చూస్తుండగానే ఇద్దరు యువకులు సంతోష్‌ను అదిమి పట్టుకోగా.. ఒకరు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం బండరాళ్లతో కూడా దాడి చేశారు. నడిరోడ్డుపై ఈ దారుణాన్ని చూస్తున్న స్థానికులు చివరకు ధైర్యం చేసి నిందితులను అడ్డుకున్నారు. అనంతరం బాధితుడు సంతోష్‌ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి పోన్‌లో ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.

సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు నిందితులు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణ అలియాస్‌ బంటిపై దాడి చేసిన కేసులో 2021లో సంతోష్‌తోపాటు ఇద్దరు యువకులు జైలుకు వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి కేసు ఉపసంహరించుకోవాలని సంతోష్‌ను పలుమార్లు హెచ్చరించారు. ఈక్రమంలోనే కృష్ణ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్