తెలంగాణలో కొత్తగా 189 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ.. ఇవాళ మరో ఇద్దరు మృతి..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి

  • Balaraju Goud
  • Publish Date - 12:34 pm, Tue, 26 January 21
తెలంగాణలో కొత్తగా 189 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ.. ఇవాళ మరో ఇద్దరు మృతి..

Telangana coronavirus : తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. ఆదివారం రాత్రి 8గంటల నుంచి సోమవారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థరణ పరీక్షల్లో కొత్తగా 189 మందికి సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా గచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ఇక ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 2,93,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారిని జయించి ఇప్పటివరకు మొత్తం 2,88,926 మంది కోలుకున్నారు. కాగా, మాయదారి రోగం బారినపడి రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,592కి పెరిగింది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,072 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వీరిలో 1,543 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక నిన్నటి నుంచి ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బందికి టీకా పంపిణీ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ.

Read Aslo… మదనపల్లి మరణాలపై మరో కోణం.. చెల్లి ఆత్మ కోసం అక్క ఆరాటం.. మిస్టరీగా మారుతున్న డబుల్ మర్డర్.!