Coronavirus: తెలంగాణలో స్పీడు పెంచిన కరోనా వైరస్.. గడిచిన 24 గంటల్లో ఎన్ని పాజిటివ్ కేసులంటే..!
Telangana Corona Update: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకు పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు....
Telangana Corona Update: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకు పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 62,350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో కొత్తగా 1,498 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, తాజాగా ఆరుగురు మృతి చెందగా, ఇప్పటి వంరకు రాష్ట్రంలో 1,729 మంది మృతి చెందారు. అలాగే ఇప్పటి వరకు రాష్ట్రంలో 3.14.735 కరోనా బారిన పడగా, ఇప్పటి వరకు 3,03,013 మంది కరోనా నుంచి కోలుకోగా, నిన్న ఒక్క రోజు 2,452 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 9,993 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 5,323 మంది హం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 313 కేసులు నమోదయ్యాయి.
కాగా, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి. గత నెల 31న పాజిటివ్ రేటు 1.49 శాతం కాగా, ఈనెల 4వ తేదీ నాటికి 2.54శాతం పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. మార్చి రెండో వారం నుంచి పరీక్షల సంఖ్య రోజూ సగటున 45-50 వేలు దాటిపోతున్నా.. పాజిటివ్ రేటు మాత్రం 1శాతం లోపే ఉంటూ వచ్చింది. గత నెల నుంచి అది కాస్త పెరిగిపోయింది. గత ఏడాది నవంబర్‌లో ఒక్క రోజు 1000 కేసులు నమోదయ్యాయి. అదే స్థాయిలో ఈ నెలలో గత మూడు రోజులుగా ప్రతి రోజు వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా వారం రోజుల్లోనే రెట్టింపయ్యారు. గత నెల 29న చికిత్స పొందే కోవిడ్ బాధితులు 4,678 మంది ఉండగా, తాజా గణాంకాల ప్రకారం.. ఈనెల 4న ఆ సంఖ్య 8,746కు చేరింది. రెండు నెలల కిందటి వరకూ మొత్తం పాజిటివ్ కేసుల్లో దాదాపు 70 శాతం ఇంటి వద్దే ఉండి చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రస్తుతం రాష్ట్రంలోని బాధితుల్లో దాదాపు సగం మంది మాత్రమే ఐసోలేషన్‌ల్లో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అయితే గత నెల 29న పాజిటివ్ రేటు 1.09 శాతం ఉండగా, 30, 1.21 ఉంది.31వ తేదీన1.49 శాతం, ఏప్రిల్ 1న 1.62 శాతం, 2వ తేదీన 1.80 శాతం, 3న 2.09శాతం, 4వ తేదీన 2.54శాతానికి పెరిగింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కొందరు మాస్కులు ధరించకపోవడం, కరోనా నిబంధనలు పాటించకపోవడం కారణంగా కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Corona: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?
Migrants: లాక్ డౌన్ భయంతో మహారాష్ట్ర నుంచి స్వస్థలాలకు వెళ్లిపోతున్న వలసకార్మికులు
Covid-19 Vaccine: వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఇప్పటివరకు 8 కోట్ల డోసులు పంపిణీ