AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి.. కోటీశ్వరులు తినే కూరగా మారనున్న కోడికూర.. ప్రస్తుతం ధర ఎంతంటే..?

కోడికూర ఇకపై కోటీశ్వరులు తినే కూరగా మారనుందా? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. మార్కెట్‌లో చికెన్‌ రేటు ఒక్కసారిగా కొండెక్కింది.

చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి.. కోటీశ్వరులు తినే కూరగా మారనున్న కోడికూర.. ప్రస్తుతం ధర ఎంతంటే..?
Balaraju Goud
|

Updated on: Apr 06, 2021 | 11:34 AM

Share

chicken rates raises: కోడికూర ఇకపై కోటీశ్వరులు తినే కూరగా మారనుందా? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. మార్కెట్‌లో చికెన్‌ రేటు ఒక్కసారిగా కొండెక్కింది. ఏకంగా బహిరంగ మార్కెట్‌లో 300లకు పైగా ధర పలుకుతోంది.

బర్డ్‌ ఫ్లూ భయంతో గతంలో బావురుమన్న పౌల్ట్రీ మార్కెట్‌, ఇప్పుడు కళకళలాడుతోంది. డిమాండ్‌కు తగినంత సప్లయ్‌ లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి వేసవి కాలం తోడవడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. విజయవాడలోని బహిరంగ మార్కెట్‌లో చికెన్‌ ధర కేజీ 310 రూపాయలు పలుకుతోంది. బర్డ్‌ ఫ్లూ వల్ల కోళ్ల పెంపకం భారీగా తగ్గిందని, అయితే ఇప్పుడు డిమాండ్‌ పెరగడంతో సప్లయ్‌ లేక చికెన్‌ ధరలు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.

మరోవైపు ఒక్కసారిగా చికెన్‌ ధర రూ. 300 దాటడంతో ఇటు చికెన్‌ప్రియులు అవాక్కవుతున్నారు. కేజీ కొనుగోలు చేసేవారు కాస్తా అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. అటు నాన్‌వెజ్‌ క్యాటరింగ్‌ చేసేవారు కూడా చికెన్‌ ధర పెరగడంతో సతమతమవుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత పెరిగడం కూడా రేటు పెరుగుదలకు ఓ కారణంగా పౌల్ట్రీ రంగ వ్యాపారులు చెబుతున్నారు. ఏటా ఈ సీజన్‌లో కోళ్ల ఉత్పత్తి తగ్గుతుందని చెప్పారు. వేసవిలో చికెన్ ధరలు పెరగడం సాధారణమేనని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ దారిలోనే గుడ్ల రేట్లు కూడా పెరిగాయి. నాలుగు నెలల క్రితం వరకు కిలో చికెన్ ధర వంద లోపే ఉండేది. పెరిగిన ధరతో సామాన్యులు నాన్ వెజ్ మాట ఎత్తితేనే మండిపడుతున్నారు. Read Also..

Follow Us
ఆ డైరెక్టర్ వల్లే నేను హ్యాండ్సమ్ విలన్ అయ్యా..
ఆ డైరెక్టర్ వల్లే నేను హ్యాండ్సమ్ విలన్ అయ్యా..
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే