Telangana Congress: ఆ 12 మంది.. తెలంగాణ కాంగ్రెస్ లేటెస్ట్ టార్గెట్ ఇదే..!

|

Jan 06, 2023 | 3:25 PM

Telangana: తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అవును.. ఆ 12 మందే.. తెలంగాణ కాంగ్రెస్ లెటెస్ట్ టార్గెట్! కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న..

Telangana Congress: ఆ 12 మంది.. తెలంగాణ కాంగ్రెస్ లేటెస్ట్ టార్గెట్ ఇదే..!
Congress
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అవును.. ఆ 12 మందే.. తెలంగాణ కాంగ్రెస్ లెటెస్ట్ టార్గెట్! కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న 12 మంది ఎమ్మెల్యేలపై యుద్ధం ప్రకటించింది. అదే టైమ్‌లో బీఆర్ఎస్‌ ను ఇరుకునపెడుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్పాట్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో.. ముగ్గురు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి బీఆర్ఎస్‌లో చేరినవారే. ఇదిగో ఈ పాయింట్‌నే పట్టుకొని స్ట్రైట్‌గా లాగుతోంది కాంగ్రెస్. ఆ ముగ్గురికి అమ్మడుపోవడం అలవాటుగా మారిందని ఆరోపిస్తోంది. ఈ ముగ్గురే కాదు.. పార్టీమారిన 12 మంది ఎమ్మెల్యేలపైనా సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తోంది.

పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మెయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది పీసీసీ. వీళ్లంతా.. బీఆర్ఎస్ నుంచి వివిధ రూపాల్లో లబ్ధి పొందారని పేర్కొంది. వాళ్లకు కలిగిన రాజకీయ, ఆర్థిక లాభాలను కూడా సవివరంగా.. కంఫ్లైంట్‌ కాపీలో వివరించింది కాంగ్రెస్. అందరిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేసింది.

పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ నిరసనలకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్. ఓ వైపు విచారణ సంస్థలకు ఫిర్యాదు చేయడం.. మరోవైపు న్యాయపోరాటం చేస్తూనే.. ఆందోళనలూ చేపట్టాలని నిర్ణయించింది. 2023 ఎన్నికల్లో మళ్లీ ఆ 12 మంది గెలువకుండా చూడటమే తమ టార్గెట్‌ అని ప్రకటించింది కాంగ్రెస్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..