సింగపూర్‌లో రెండో రోజు సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.3500 కోట్ల ఒప్పందాలపై సంతకాలు
ప్రస్తుతం హైటెక్ సిటీలో డేటా సెంటర్ నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటు ద్వారా తమ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. సంస్థ లక్ష్యంగా దశాబ్దంలో 1 గిగావాట్ సామర్థ్యంతో విస్తరణ చేయాలని భావిస్తోంది. ఈ కాలంలో సుమారు రూ.26,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అంచనా..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో ST Telemedia Global Data Center (STT GDC) సంస్థ తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. మీర్ఖాన్ పేట, ముచ్చర్ల సమీపంలో 100 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విస్తరణ సౌకర్యంతో పాటు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, STT గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా బ్రూనో లోపెజ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతిశీల విధానాలు, ప్రభుత్వం అందించే సహకారం, ఆధునిక మౌలిక సదుపాయాలు సాంకేతిక ఆవిష్కరణలకు ఎంతో అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తు నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రపంచ డేటా సెంటర్ల రాజధానిగా అవతరిస్తోందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి చూపిన STT GDC సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా AI ఆధారిత రంగంలో వస్తున్న మార్పుల్లో హైదరాబాద్ కీలక పాత్ర పోషించగలదని ధీమా వ్యక్తం చేశారు.
STT GDC సంస్థ ప్రస్తుతం హైటెక్ సిటీలో డేటా సెంటర్ నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటు ద్వారా తమ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. సంస్థ లక్ష్యంగా దశాబ్దంలో 1 గిగావాట్ సామర్థ్యంతో విస్తరణ చేయాలని భావిస్తోంది. ఈ కాలంలో సుమారు రూ.26,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అంచనా.
తెలంగాణలో ఏర్పాటు కానున్న ఈ అత్యాధునిక డేటా సెంటర్ రాష్ట్ర మౌలిక సదుపాయాలను కొత్త మెరుగులకు తీసుకెళ్తూ, ప్రపంచ డేటా హబ్‌గా హైదరాబాద్‌ను గుర్తింపును సాధించేందుకు తోడ్పడనుంది.
ఇది కూడా చదవండి: HDFC బ్యాంకు కస్టమర్ల బిగ్ అలర్ట్.. 16 గంటలు బ్యాంకు సేవలకు అంతరాయం.. ఎప్పుడో తెలుసా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
