Coal Blocks: ఆ నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయండి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ లేఖ

Coal Blocks: కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో తలపెట్టిన నాలుగు బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన నరేంద్ర మోడీని కోరారు. కోల్‌ బ్లాక్స్‌..

Coal Blocks: ఆ నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయండి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ లేఖ
Follow us
Subhash Goud

|

Updated on: Dec 08, 2021 | 10:22 PM

Coal Blocks: కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో తలపెట్టిన నాలుగు బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన నరేంద్ర మోడీని కోరారు. కోల్‌ బ్లాక్స్‌ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రతి సంవత్సరం 65 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని థర్మల్‌ పవర్‌ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీరుస్తోందని సీఎం కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు సరఫరా చేయడం ఎంతో ముఖ్యమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్‌ లీజులు మంజూరు

కాగా, సింగరేణి బొగ్గు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్‌ లీజులు మంజూరు చేసిందని, అందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఈ నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించాలని కేసీఆర్‌ కోరారు.

ఇవి కూడా చదవండి:

New CDS: భారత సాయుధ త్రివిధ దళాల కొత్త అధిపతి ఎవరు? అప్పుడే మొదలైన చర్చ!

Viral Video: నేటి యువతకు ఆదర్శం ఈ వృద్ధదంపతులు.. జీవన పోరాటం రూ.10 లకు పోహా అమ్మకం..