Telangana Assembly: పంచాయ‌తీరాజ్ కొత్త చ‌ట్టంతో గ్రామీణ వ్యవస్థ బలోపేతం.. శాసనసభలో సీఎం కేసీఆర్

CM KCR in Telangana Assembly: నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టం ద్వారా గ్రామీణ వ్యవస్థను బలోతంగా చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్త చ‌ట్టానికి అనుగుణంగా నిధుల పంపిణీ, విడుద‌ల జ‌రుగుతుంద‌న్నారు.

Telangana Assembly: పంచాయ‌తీరాజ్ కొత్త చ‌ట్టంతో గ్రామీణ వ్యవస్థ బలోపేతం.. శాసనసభలో సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 01, 2021 | 5:00 PM

CM KCR in Assembly: నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టం ద్వారా గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్త చ‌ట్టానికి అనుగుణంగా నిధుల పంపిణీ, విడుద‌ల జ‌రుగుతుంద‌న్నారు. త‌మ ప్రభుత్వం పార‌ద‌ర్శకంగా ప‌ని చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ శాసనసభలో ప్రసగించిన ముఖ్యమంత్రి.. సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్కకు చుర‌క‌లంటించారు. స‌ర్పంచ్‌ల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోంద‌న్న సీఎం.. గత ప్రభుత్వాల హ‌యాంలో గ్రామ పంచాయతీలను, స‌ర్పంచ్‌ల‌ను ప‌ట్టించుకోలేదు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత స‌ర్పంచ్‌ల‌కు స్వేచ్ఛ ఇచ్చి, స్థానిక సంస్థలకు అన్ని హ‌క్కులు క‌ల్పించామ‌ని సీఎం గుర్తు చేశారు.

శాస‌న‌స‌భ‌లో స‌భ్యులు స‌త్యదూర‌మైన విష‌యాలు మాట్లాడారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ప‌ల్లె, ప‌ట్టణ‌ ప్రగ‌తిపై స్వల్పకాలిక చ‌ర్చ కాదు.. దీర్ఘకాలిక చ‌ర్చ పెట్టండి అని స్పీక‌ర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీ నిలబట్టుకోవడంలో ముందుంటామన్నారు. గ్రామీణాభివృద్దిపై దృష్టి పెట్టామన్న సీఎం.. ఏక‌గ్రీవ‌మైన గ్రామ‌పంచాయ‌తీల‌కు నిధులు ఇస్తామ‌ని ఎక్కడా చెప్పలేదు. నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో ఆ ప్రస్తావ‌నే లేదు. ఆ చ‌ట్టం ప్రకారమే నిధుల పంపిణీ, విడుద‌ల జ‌రుగుతుంద‌న్నారు.

స‌ర్పంచ్‌ల‌కు స‌ర్వ స్వేచ్ఛ ఇచ్చామ‌న్నారు. స‌ర్పంచ్‌ల‌కు అన్ని హ‌క్కులు క‌ల్పించామ‌న్నారు. ప‌న్నులు వ‌సూలు చేసుకునే బాధ్యత‌ను స్థానిక సంస్థలకే అప్పగించామని సీఎం తెలిపారు. గ‌త ప్రభుత్వాల హ‌యాంలో పంచాయ‌తీల్లో అవినీతి జ‌రిగింది. గ్రామాల్లో ప‌రిశుభ్రత కోసం ఎన్నో కార్యక్ర‌మాలు చేప‌ట్టాం. వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో మ‌ర‌ణాలు సంభ‌వించేవి. ఇప్పుడు అన్ని సీజ‌న‌ల్ వ్యాధులు, డెంగీ లాంటి విష‌జ్వరాలు త‌గ్గిపోయాయి. గ్రామాల రూపురేఖ‌ల‌ను మార్చేశామ‌ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. Read Also…. Chiranjeevi: రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి