KCR: తల్లిదండ్రుల కలను నిజం చేసిన సీఎం కేసీఆర్.. తొమ్మిదేళ్ల తర్వాత బిడ్డకు నామకరణం చేసి..
KCR: ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కాన్వాయ్ ఆపి ప్రజలతో ముచ్చటించినా, చిన్ననాటి స్నేహితులు గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించినా అది కేసీఆర్‌కే..
KCR: ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కాన్వాయ్ ఆపి ప్రజలతో ముచ్చటించినా, చిన్ననాటి స్నేహితులు గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించినా అది కేసీఆర్‌కే దక్కిందని చెప్పాలి. తాజాగా ఇలాంటి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చి భూపాలపల్లికి చెందిన తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురి చేశారు. తమ తొమ్మిదేళ్ల కలను నిజం చేసి వారి కుటుంబంలో సంతోషాన్ని నింపారు. ఇంతకీ విషయమేంటంటే..
భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత అనే దంపతులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన సురేశ్.. తన బిడ్డకు కేసీఆర్‌తోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ బిడ్డకు తొమ్మిదేళ్లు నామకరణం చేయకుండానే ఉండిపోయారు. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ శ్రీ మధుసూధనాచారి కేసీఆర్‌కు సమాచారం అందించారు. అంతటితో ఆగకుండా ఆదివారం తల్లిదండ్రులను, బిడ్డను ప్రగతి భవన్‌కు తీసుకొచ్చారు.
దీంతో సురేష్, అనిత దంపతులను దీవించిన కేసీఆర్ దంపతులు.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ బిడ్డకు ‘మహతి’ అని నామకరణం చేశారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్దతిలో ఆథిత్యమిచ్చారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్ని సైతం సీఎం అందించారు. ఇలా తమ తొమ్మిదేళ్ల కల ఫలించడంతో పాటు ఊహించని రీతిలో ముఖ్యమంత్రి తమను ఇంటికి పిలిపించడంతో సీఎం దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..