Collectors conference: జిల్లా కలెక్టర్లతో సీఎం విస్తృతస్థాయి సమావేశం.. ఇవాళ దళిత బంధు పథకంపై కేసీఆర్ కీలక ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జిల్లా కలెక్టర్లతో సమావేశం అవుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో ఈ విస్తృతస్థాయి సమావేశం జరుగనున్నట్లు సీఎంవో కార్యాలయం తెలిపింది.

Collectors conference: జిల్లా కలెక్టర్లతో సీఎం విస్తృతస్థాయి సమావేశం.. ఇవాళ దళిత బంధు పథకంపై కేసీఆర్ కీలక ప్రకటన
Cm Kcr
Follow us

|

Updated on: Dec 18, 2021 | 12:48 PM

CM KCR chairs District Collectors conference: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జిల్లా కలెక్టర్లతో సమావేశం అవుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో ఈ విస్తృతస్థాయి సమావేశం జరుగనున్నట్లు సీఎంవో కార్యాలయం తెలిపింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ద‌ళిత బంధు పథకం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం సాగనున్నట్టుగా తెలుస్తోంది. దళితబంధుతోపాటు ధాన్యం సేకరణ, ప్రభుత్వ పథకాల అమలు, రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌, పోడు భూముల సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నారు.

కేంద్ర వరి ధాన్యం కోనుగోలు చేయనని తేల్చి చెప్పడంతో ప్రత్యామ్నాయ పంటలు వేయడంపై రైతుల్లో అవగాహన కల్పించడం, యాసంగి పంటల సాగు, జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను సీఎం ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్.. జిల్లా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయనున్నారు. అలాగే, పల్లెప్రగతి, మెడికల్‌ కాలేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు, కార్యాచరణ ఖరారు చేసి కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తారు. పల్లెప్రగతి, మెడికల్‌ కాలేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు, పట్టణప్రగతి, హరితహారం, ధరణి సమస్యల వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలో దళిత బంధు పథకంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దళిత బంధు పథకం నిధులను యాదాద్రి జిల్లా వాసాల‌మ‌ర్రిలో ప‌లువురికి పంపిణీ కూడా చేశారు. హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. ఇక్కడ బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్.. దశల వారీగా అమలు చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత దళిత బంధు అమలుకు ఖ‌మ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింత‌కాని మండ‌లం, సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తిరుమ‌ల‌గిరి మండ‌లం, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగ‌ర్ మండ‌లాలను పథకం అమలు కోసం ఎంపిక చేశారు.

ఈ క్రమంలోనే కేసీఆర్.. నేడు జరగనున్న విస్తృత స్థాయి సమావేశంలో కలెక్టర్లు, మంత్రులతో దళిత బంధుపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారులు కూడా పాల్గొననున్నారు. దళితబంధు పథకం అమలుపై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చే అంశంపై కలెక్టర్లకు కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు.

Read Also…  Iraq Floods: కరవుతో అల్లాడిన దేశంలో భారీవర్షాలు.. మెరుపు వరద ధాటికి 12 మంది మృత్యువాత!