PM Modi-KCR: మరోసారి తేటతెల్లమైంది.. మే 26న హైదరాబాద్‌కు రానున్న మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

PM Modi-KCR: కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మధ్య సంబంధాలు సవ్యంగా లేవని మరోసారి తేటతెల్లమైంది. హైదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం ..

PM Modi-KCR: మరోసారి తేటతెల్లమైంది.. మే 26న హైదరాబాద్‌కు రానున్న మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం
Follow us

|

Updated on: May 23, 2022 | 6:45 PM

PM Modi-KCR: కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మధ్య సంబంధాలు సవ్యంగా లేవని మరోసారి తేటతెల్లమైంది. హైదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్‌ రావడం లేదు. ప్రస్తుతం దేశంలో పర్యటిస్తున్న కేసీఆర్‌.. ఈ నెల 26న బెంగళూరుకు వెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని ఈ నెల 26న హైదరాబాద్‌ వస్తున్నారు. బిజీ షెడ్యూల్‌ కారణంగా సీఎం రావడం లేదని ISB డీన్‌ మదన్‌ పిల్లుట్ల ధ్రువీకరించారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు సాధారణంగా ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతుంటారు. కానీ టీఆర్‌ఎస్‌- బీజేపీ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈ సంప్రదాయం మారుతోంది. ఫిబ్రవరి 5న హైదరాబాద్‌కు మోదీ వచ్చినప్పడు కూడా కేసీఆర్‌ స్వాగతం పలకలేదు. నాడు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం పలికారు. గడిచిన రెండేళ్లలో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదు.

ప్రధాన మోడీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనకపోవడం ఇది మూడోసారి. 2020 నవంబర్‌ 28న మోడీ హైదరాబాద్‌లో పర్యటించారు. కరోనా వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ కార్యాలయాన్ని సందర్శించారు. అప్పుడు కేసీఆర్‌ కలువలేదు. ఫిబ్రవరిలో కూడా ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించారు. ముచ్చింతల్‌లోని చిన్నజీయర్‌ ఆశ్రమంలో సమతా మూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఇక్రిశాట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాటికి కూడా కేసీఆర్‌ హాజరు కాలేదు. మే 26న ప్రధాన హైదరాబాద్‌కు వస్తుండగా కేసీఆర్‌ బెంగళూరులో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్