Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. సమావేశాలు ఎన్ని రోజులంటే..
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ, మండల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఈనెల 3న నిర్వహించే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ, మండల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఈనెల 3న నిర్వహించే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, ప్రవేశపెట్టే బిల్లులపై చర్చించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. వచ్చే సోమవారానికి వాయిదా పడ్డాయి. మొత్తం మూడు రోజులపాటు అంటూ ఈ రోజు మొదటి రోజు సమావేశాలు కొనసాగి వాయిదా పడగా, తర్వాత 12, 13 తేదీల్లో సమావేశాలు జరుగనున్నాయి.
ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. మరణించిన మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, జనార్ధన్‌రెడ్డిల మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అయితే తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు తమ శాఖలకు చెందిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీస్ రూల్స్ 2022 బిల్లును హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈనెల 16,17,18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటు దళిత బంధు పథకాన్ని నియోజకవర్గాల వారీగ అందజేస్తున్న 100 కుటుంబాలకు అదనంగా మరో 500 మందికి ఈ పథకాన్ని విస్తరించాలని మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి