Hyderabad: హైదరబాదీలు జాగ్రత్త! హెల్మెట్ లేకుండా చిక్కారో.. కళ్లు బైర్లు కమ్మే ఫైన్ పడ్డట్టే!
సిటీలో ఇకపై ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. హైదరాబాద్ నగర పరిధిలో 3 నెలల వ్యవధిలో 3 సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జేబుకు చిళ్లు పడ్డట్టే..

Hyderabad Traffic rule update: సిటీలో ఇకపై ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. హైదరాబాద్ నగర పరిధిలో 3 నెలల వ్యవధిలో 3 సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జేబుకు చిళ్లు పడ్డట్టే. సాధారణంగా హెల్మెట్ లేకపోతే రూ.100 జరిమానా విధించడం పరిపాటి. ఐతే ఇకపై3 నెలల వ్యవధిలో హెల్మెట్ లేకుండా మూడుసార్లు పట్టుపడితే మొదటిసారి రూ.100, రెండోసారి రూ.200, మూడోసారి రూ.500ల చొప్పున జరిమానా విధిస్తారు. అంటే హెల్మెట్ లేకుండా మూడు సార్లు పట్టుబడితే మూడోసారి 400 శాతం అదనంగా జరిమానా చెల్లించవల్సి ఉంటుంది. ఏటా నమోదవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘన కేసులకు కళ్లెం వేసి, వాహనదారుల్లో చైతన్యం తీసుకురావడం కోసమే ఇలా చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల ఏటా వల్ల 290 మంది చనిపోతున్నారు. ఈ సంఖ్యను తగ్గించాలన్నదే మా తాపత్రయం అని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు ఎంత కఠినంగా విధించినా ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపంచడం లేదు. ఇప్పటికే వారం రోజులుగా ఇలా దాదాపు 50 వేలమంది వాహనదారులపై ఇప్పటికే జరిమనాను విధిస్తూ చలాన్లు జారీ చేశారు కూడా. ఐతే మొదటిసారి పట్టుబడినప్పడు విధించిన చలానాకు మొత్తం జరిమానా చెల్లిస్తే అలాంటి వారికి ఈ నిబంధన వర్తించదు. జరిమానా చెల్లించని వారికి మాత్రమే మూడో సారి పట్టుబడితే రూ.500లు జరిమానా విధిస్తున్నారు.