Telangana: హైటెక్ చదువులంటే ఇదేనేమో.. ఫోన్‌లో చూస్తూ ఇంటర్‌ పరీక్ష రాసిన విద్యార్థులు.. ఎక్కడంటే

|

Feb 05, 2023 | 11:16 AM

కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని ఆదిలాబాద్‌ సైన్స్‌ కళాశాలో ఇంటర్నల్‌ పరీక్షల సందర్భంగా విద్యార్ధులు ఫోన్‌లో చూసి పరీక్షలు రాసారు. కళాశాలలోని ప్రింటర్‌ పాడయిందంటూ ఫిజిక్స్‌ క్వశ్చన్‌ పేపర్‌ను విద్యార్ధులకు వాట్సప్‌లో పంపించారు.

Telangana: హైటెక్ చదువులంటే ఇదేనేమో.. ఫోన్‌లో చూస్తూ ఇంటర్‌ పరీక్ష రాసిన విద్యార్థులు.. ఎక్కడంటే
Question Paper In Whatsapp
Follow us on

కాలం మారుతోంది.. అన్నిటిలో వచ్చిన మార్పుల్లో భాగంగా చదువుల్లో, పరీక్షల నిర్వహణలో కూడా మార్పులు వచ్చాయి. కొందరు స్టూడెంట్స్ ఒక అడుగు ముందుకేసి.. హైటెక్ పద్దతిలో చదువులు, పరీక్షలు అంటున్నారు. ఇందుకు సాక్ష్యంగా నిలిచింది తెలంగాణాలో జరిగిన ఓ ఘటన. ఓ కళాశాలలో ఇంటర్నరల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధులు చక్కగా ఫోన్‌ ముందు పెట్టుకొని హ్యాపీగా ఎగ్జామ్‌ రాశారు. ఈ ఘటన అదిలాబాద్‌ జిల్లాలో జరిగింది. అవును, అదిలాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వాకం ఎలా ఉందంటే.. ప్రింటర్‌ పాడయిందని ప్రశ్నపత్రాన్ని విద్యార్ధులకు వాట్సప్‌లో పంపించి ఎగ్జామ్స్‌ రాయించారు. కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని ఆదిలాబాద్‌ సైన్స్‌ కళాశాలో ఇంటర్నల్‌ పరీక్షల సందర్భంగా విద్యార్ధులు ఫోన్‌లో చూసి పరీక్షలు రాసారు. కళాశాలలోని ప్రింటర్‌ పాడయిందంటూ ఫిజిక్స్‌ క్వశ్చన్‌ పేపర్‌ను విద్యార్ధులకు వాట్సప్‌లో పంపించారు.

విద్యార్థులు దానిని తమ స్మార్ట్‌ఫోన్లలో చూసి జవాబులు రాస్తూ కనిపించారు. సెల్‌ఫోన్ దగ్గరుంటే కాపీ కొట్టరా? అన్న ప్రశ్నకు ప్రిన్సిపల్ జగ్‌రాం అంతర్బేది .. అలాంటి అవకాశం లేకుండా ఉండేందుకు విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టి పరీక్ష రాయించామని, వారిపై ఓ కన్నేసి ఉంచామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..