Telangana: కోటి ఆశలతో పెళ్లికి సిద్ధమయ్యాడు.. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే..
పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లిపీటలెక్కాల్సిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్షల్ అయిందని తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన దాసరి విజయ్ అనే యువకుడికి కొద్దిరోజుల క్రితమే పెళ్లి కుదిరింది. బంధు మిత్రుల సమక్షంలో వైభవంగా నిశ్చితార్థం కూడా జరిగింది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ సడెన్‌గా ఆ వివాహం రద్దయింది. అప్పటివరకు పెళ్లి కలలతో ఉన్న విజయ్ పెళ్లి క్యాన్షన్ అవ్వడాన్ని తట్టుకోలేకపోయాడు.
ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామనుకున్న ఆశలు నిరాషలు కావడంతో తీవ్ర మస్తాపానికి గురైన విజయ్ సమాజంలో ముఖం చూపించలేక, మనోవేదనతో కుంగిపోయాడు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం లేచి పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పొలానికి వెళ్లిన విజయ్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పొలం దగ్గరకు వెళ్లి చూశారు.
అప్పటికే స్పృహ కోల్పోయిన పడి ఉన్న విజయ్‌ను చూసి వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే అప్పటికే విషం శరీరమంతా పాకడంతో పరిస్థితి విషమించి చికిత్స పొందుతూనే విజయ్ ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి చేసుకొని ఇంటివాడవ్వాల్సిన ఒక్కగానొక్క కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
