TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్.. మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తెలంగాణలో వివాదాస్పదమైన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రోజురోజుకు కొత్త ట్విస్టులు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో పోలీసులు మరో ముగ్గురుని అరెస్టు చేశారు. ఈ ముగ్గురి అరెస్టుతో ఈ లీకేజీ కేసులో ఇప్పటివరకు 77 మందిని అరెస్టు చేశారు.

TSPSC
తెలంగాణలో వివాదాస్పదమైన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రోజురోజుకు కొత్త ట్విస్టులు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో పోలీసులు మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ ముగ్గురి అరెస్టుతో ఈ లీకేజీ కేసులో ఇప్పటివరకు 77 మందిని అరెస్టు చేశారు. రమేష్ అనే నిందితుడు ఏఈ పేపర్‌ను 30 మందికి విక్రయించాడు. రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో అరెస్టులు చేయడం కొనసాగిస్తున్నారు. రమేష్ పరీక్ష రాసిన తర్వాత డబ్బులు ఇచ్చేలా అభ్యర్థులతో డీల్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మరోవైపు ఐదు ప్రత్యేక బృందాలతో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
