AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కేంద్రంపై తగ్గేదే లే అంటున్న కేసీఆర్.. తెలంగాణ సీఎం కొత్త నినాదం ఇదే..

కేంద్రంపై తగ్గేదేలె అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana CM KCR). ఇన్నాళ్లూ బంగారు తెలంగాణ కోసం పాటుపడిన తాను... ఇకపై

Telangana: కేంద్రంపై తగ్గేదే లే అంటున్న కేసీఆర్.. తెలంగాణ సీఎం కొత్త నినాదం ఇదే..
Telangana Cm Kcr
Janardhan Veluru
|

Updated on: Feb 21, 2022 | 6:52 PM

Share

కేంద్రంపై తగ్గేదే లే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana CM KCR). బంగారు తెలంగాణలాగే.. బంగారు భారత్‌ అంటూ కేసీఆర్‌ కొత్త నినాదమిచ్చారు. ఇన్నాళ్లూ బంగారు తెలంగాణ కోసం పాటుపడిన తాను… ఇకపై బంగారు భారత్‌ కోసం కృషిచేస్తానని స్పష్టం చేశారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సీఎం… సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. మరోసారి కేంద్రంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.   75ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా.. దేశంలో పరిస్థితులు ఉండాల్సిన విధంగా లేవంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు.  కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే పనికిమాలిన దందా నడుస్తోందని.. పరోక్షంగా బీజేపీపై విరుచుకపడ్డారు. ఇది మారాలంటే జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సత్తా చూపాన్నారుల్సిందేనని కేసీఆర్ అన్నారు.

అమెరికా కంటే గొప్పదేశంగా భారత్‌ను తీర్చిదిద్దుకునే అవకాశం ఉందన్నారు కేసీఆర్‌. అందుకు అవసరమైన యువశక్తి.. దేశానికి పుష్కలంగా ఉందన్నారు కేసీఆర్‌. ఆ దిశగా జాతీయ రాజీకాయాల్లో ముందుకు సాగుదామంటూ.. ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్‌. తెలంగాణలో అమలవుతున్నరైతు బంధు పథకం గురించి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే కూడా ఆరా తీసినట్లు తెలిపారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్‌. ఏడాదిన్నరలోపు ఈ లిఫ్ట్‌ ఇరిగేషన్‌లో నీళ్లు దుముకాలనీ… జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ నీళ్లు పారాలనీ మంత్రి హరీశ్‌ను, అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయ్యేదాకా, అధికారులు, కాంట్రాక్టర్ల వెంటబడాలని చెప్పారు. నారాయణఖేడ్‌ సభావేదికగా సంగారెడ్డి జిల్లాపై సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీకి వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తానన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు.. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

Also Read..

Defence Jobs: పదో తరగతి అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Minister Goutham Reddy Death: మంత్రి మేకపాటిపై సోషల్ మీడియాలో వస్తున్నవి అవాస్తవం.. ‘అసలు ఏం జరిగిందంటే..’