AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: బీఆర్ఎస్‌కు బీ-టీంగా కాంగ్రెస్.. బండి సంజయ్‌ను మార్చేది లేదు.. తరుణ్ చుగ్

TBJP IN-charge Tarun Chugh: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలకు రెడీ అవుతున్నారు.

Telangana BJP: బీఆర్ఎస్‌కు బీ-టీంగా కాంగ్రెస్.. బండి సంజయ్‌ను మార్చేది లేదు.. తరుణ్ చుగ్
Tarun Chugh
Shaik Madar Saheb
|

Updated on: Jun 15, 2023 | 3:55 PM

Share

TBJP IN-charge Tarun Chugh: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలకు రెడీ అవుతున్నారు. ఈనెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నట్లు టీబీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. నాగర్ కర్నూల్ లో జరిగే భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన తరుణ్ చుగ్.. అతి త్వరలో అమిత్ షా పర్యటన కూడా ఖరారు కానున్నట్లు తెలిపారు. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తున్నారన్న వార్తలపై స్పందించిన తరుణ్ చుగ్.. బండి సంజయ్ ని మార్చేది లేదని బిజెపి జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చినట్లు తెలిపారు. నేతలంతా సమిష్టిగా కలిసి ఎన్నికల సమరంలో ఉంటారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ పేర్కొన్నారు. పార్టీలో ముఖ్య నేతలు అందరికీ కీలకమైన బాధ్యతలు ఉంటాయని.. రాష్ట్ర నాయకత్వం సమిష్టిగానే పనిచేస్తుందని తెలిపారు.

బిజెపి ఎదుగుదలను చూసి ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లు విమర్శించారు. బిజెపి, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్నడం అభూత కల్పనంటూ పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ నెతృత్వంలోని విపక్షాల భేటీకి కాంగ్రెస్ తో పాటు కేసీఆర్ కూడా హాజరవుతున్నారని.. దీనికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

పై స్థాయిలో అంతా కలిసి పనిచేస్తారు రాష్ట్రానికి వచ్చేసరికి విమర్శలు చేసుకుంటారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ సంస్కృతి ఇది అంటూ చుగ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీ-టీంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది.. కొన్ని సందర్భాల్లో బీ టీంగా, మరికొన్నిసార్లు సీ-టీంలో కూడా కాంగ్రెస్ నే పోటీ పడుతోందని టీబీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..