TS Lawcet 2023 Results: తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి..
తెలంగాణ లాసెట్, పీజీసెట్-2023 ప్రవేశ పరీక్షల ఫలితాలు గురువారం (జూన్ 15) విడుదలయ్యాయి. ఈ రోజు సాయంత్రం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలు విడుదల..

తెలంగాణ లాసెట్, పీజీసెట్-2023 ప్రవేశ పరీక్షల ఫలితాలు గురువారం (జూన్ 15) విడుదలయ్యాయి. ఈ రోజు సాయంత్రం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. లాసెట్‌లో 78.59 శాతం, పీజీసెట్‌లో 80.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మే 25న లాసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహించింది.
ఈ ఏడాది లాసెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 43,692 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 36,218మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో 60, ఏపీలో 4 పరీక్షా కేంద్రాల్లో వీరికి పరీక్షలు జరిగాయి. దాదాపు 25,747 మంది విద్యార్ధులు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు పోటీ పడుతున్నారు.
కాగా లాసెట్, పీజీ ఎల్ సెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కౌన్సెలింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 30కిపైగా లా కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.




మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.




