Telangana: ఆత్మ రక్షణ కోసం నేనే చంపా.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు.. Viral Video
ఆత్మరక్షణ కోసం లాలప్పను హత్య చేశానని వీడియో చేసిమరీ శ్రీశైలం యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Vikarabad District: ఎవరికైనా ప్రాణభయం ఉంటే ఏం చేస్తారు? పోలీసులను ఆశ్రయిస్తారు కదా. కానీ, తాండూర్ (Tandur) లో ఓ యువకుడు మాత్రం ఘోరం చేశాడు. ఆఖరికి కటకటాల పాలయ్యాడు. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఓ వీడియో తాజాగా సంచలనంగా మారింది. శ్రీశైలంయాదవ్ అనే యువకుడు ఇంటి అడ్రస్, కుటుంబసభ్యుల పేర్లతో సహా చెబుతూ, ఓ వీడియో చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాండూరు పట్టణంలో ట్రాక్టర్ లాలప్ప అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సంచలనం సృష్టించిన ఘటనలో శ్రీశైలం యాదవ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, ఆత్మరక్షణ కోసం లాలప్పను హత్య చేశానని వీడియో చేసిమరీ శ్రీశైలం యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఓ అజ్ఞాతపు ఫోన్ కాల్ ఈ మర్డర్‌కు కారణమైందని తెలుస్తోంది. గౌతాపూర్‌కు చెందిన లాలప్ప ఓ ఫోన్ కాల్ విషయంలో, తన భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తనను హత్య చేసేందుకు పథకం పన్నాడని స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడు శ్రీశైలం యాదవ్. తనను చంపకముందే, తానే హత్య చేశానని చెప్పాడు. శ్రీశైలం యాదవ్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు తాండూరు ప్రాంతంలో తీవ్ర వైరల్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: