AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సోషల్ మీడియాలో మెసేజ్ లు.. ఐపీఎస్ అధికారిణి కోసం అమెరికా నుంచి వచ్చి.. చివరకు

అమెరికాలో(America) నివాసముంటున్న వ్యక్తి.. హైదరాబాద్(Hyderabad) లో ఉండే మహిళా ఐపీఎస్ కు మెసేజ్ లు పంపించాడు. అంతటితో ఆగకుండా ఆమెను కలిసేందుకు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడు. అధికారిణి నివాసముంటున్న...

Telangana: సోషల్ మీడియాలో మెసేజ్ లు.. ఐపీఎస్ అధికారిణి కోసం అమెరికా నుంచి వచ్చి.. చివరకు
Arrest
Ganesh Mudavath
|

Updated on: May 11, 2022 | 9:14 AM

Share

అమెరికాలో(America) నివాసముంటున్న వ్యక్తి.. హైదరాబాద్(Hyderabad) లో ఉండే మహిళా ఐపీఎస్ కు మెసేజ్ లు పంపించాడు. అంతటితో ఆగకుండా ఆమెను కలిసేందుకు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడు. అధికారిణి నివాసముంటున్న ప్రాంతానికి వెళ్లాడు. దీంతో సదరు ఐపీఎస్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పంజాబ్‌(Punjab) రాష్ట్రంలోని అమృత్‌సర్‌ తర్న్‌తరన్‌ ప్రాంతానికి చెందిన మల్‌రాజ్‌ సింగ్‌ అలౌక్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసముంటున్నాడు. అక్కడే ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఓ మహిళా ఐపీఎస్‌ ఆఫీసర్ హైదరాబాద్ లోని జనవరి లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటికే ఆమెకు మల్‌రాజ్‌ సోషల్ మీడియాలో మెసేజ్ లు పంపిస్తున్నాడు. మహిళా ఐపీఎస్ అధికారిణి హైదరాబాద్ లో ఉంటున్నారని తెలుసుకుని అమెరికా నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చాడు.

ఈనెల 1న ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నాడు. ఆమె ఉంటున్న అతిథి గృహం వద్దకు వెళ్లాడు. అలౌక్‌తో మాట్లాడటానికి ఆమె నిరాకరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Faria Abdullah: కోలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‏గా ఫరియా ?..

Viral Video: స్నేహ గీతాలు ఆలపిస్తూ చక్కర్లు కొడుతున్న సింహం-కుక్క.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం..!