AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎంజీబీఎస్ లో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతం.. తల్లిదండ్రుల చెంతకు చిన్నారి

హైదరాబాద్(Hyderabad) నగరంలోని ఎంజీబీఎస్(MGBS) లో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. సోమవారం కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల బాలుడు నవీన్‌ ను పోలీసులు గుర్తించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. నిన్న....

Hyderabad: ఎంజీబీఎస్ లో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతం.. తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
Afzal Ganj
Ganesh Mudavath
|

Updated on: May 11, 2022 | 12:23 PM

Share

హైదరాబాద్(Hyderabad) నగరంలోని ఎంజీబీఎస్(MGBS) లో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. సోమవారం కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల బాలుడు నవీన్‌ ను పోలీసులు గుర్తించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. నిన్న(మంగళవారం) రాత్రి ఎంజీబీఎస్‌ వద్ద నల్గొండ బస్సులో బాలుడు కనిపించాడు. మొన్న రాత్రి బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లాడు. బాలుడు ఉన్నట్లు గుర్తించిన బస్సు నిన్న మధ్యాహ్నం మిర్యాలగూడలో(Miryalaguda) బయలుదేరింది. రాత్రి ఎంజీబీఎస్‌లో ఉన్న నల్గొండ బస్సులో నిద్రపోతున్న బాలుడిని కండక్టర్‌ గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని చేరదీసి, నిన్న రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నవీన్‌ను కిడ్నాప్‌ చేసిన వ్యక్తే నల్గొండలో బస్సు ఎక్కించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ ఎంజీబీఎస్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. స్వగ్రామానికి వెళ్లేందుకు బస్ స్టేషన్ కు వచ్చిన బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి.. తన కూతురి వద్దకు వెళ్లేందుకు కుమారుడితో కలిసి ఎంజీబీఎస్ కు వచ్చాడు. బాలుడిని 44వ నెంబరు ఫ్లాట్‌ఫారం వద్ద నిల్చోబెట్టి శౌచాలయానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి బాలుడు కనిపించలేదు. పరిసరాల్లో ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బాలుడ్ని గుర్తుతెలియని వ్యక్తి తీసుకుని వెళ్తున్నట్లు సీసీ ఫుటేజీలో దృశ్యాలు లభించాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

AP CAS Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లో 31 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే!

UPSC Prelims 2022: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..