AP CAS Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లో 31 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయుటకు.. రెగ్యులర్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల (Civil Assistant Surgeon Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

AP CAS Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లో 31 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే!
ACSR
Follow us
Srilakshmi C

|

Updated on: May 11, 2022 | 12:27 PM

AP Civil Assistant Surgeon Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయుటకు.. రెగ్యులర్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల (Civil Assistant Surgeon Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 31

ఖాళీల వివరాలు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు

వయోపరిమితి: జులై 1, 2021 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డిస్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్సిటల్‌ సర్వీసెస్‌ (APVVP), ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 19, 2022 (సాయంత్రం 5:30)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

SSC CHSL Final Results 2019: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్‌ 2019 తుది ఫలితాలు విడుదల