Telangana: సస్పెన్స్‌గా మారిన బండి సంజయ్ అరెస్ట్.. నోరు మెదపని పోలీసులు..
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్ట్ సస్పెన్స్‌గా మారింది. ఆయన అరెస్ట్‌కు కారణం ఇంకా తెలియడం లేదు. పోలీసులు మాత్రం CRPC 151 కింద తీసుకెళ్లినట్లు చెప్పారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరి ఏ కేసులో ఆయనను అరెస్ట్ చేశారనే విషయంపై కరీంనగర్ పోలీసులు స్పందించడం
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్ట్ సస్పెన్స్‌గా మారింది. ఆయన అరెస్ట్‌కు కారణం ఇంకా తెలియడం లేదు. పోలీసులు మాత్రం CRPC 151 కింద తీసుకెళ్లినట్లు చెప్పారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరి ఏ కేసులో ఆయనను అరెస్ట్ చేశారనే విషయంపై కరీంనగర్ పోలీసులు స్పందించడం లేదు. ఏ కేసులో తమ స్టేషన్‌కి తరలించారో తెలియదని చెబుతున్నారు బొమ్మలరామారం పోలీసులు. హిందీపేపర్ లీక్ అయితే వరంగల్ తరలించాలి కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు సైతం బండి సంజయ్ అరెస్ట్‌పై నో కామెంట్ అంటున్నారు. మరోవైపు అసలు వారెంట్ ఇవ్వకుండా అరెస్ట్ ఏంటో తెలీదని చెబుతున్నారు బండి సంజయ్ కుటుంబ సభ్యులు.
బండి సంజయ్ అరెస్ట్ లైవ్ అప్‌డేట్స్ కింది వీడియోలో చూడొచ్చు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి