ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చిన్న పిల్లలు ఆడుకుంటూ ఏదైనా వస్తువు మింగితే వెంటనే గుర్తుకొచ్చేది ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి. నెల రోజుల వ్యవధిలోనే వరుసగా ముగ్గురు పిల్లలను కాపాడారు. ఒకరు తాళం మరొక బాబు స్ప్రింగ్ సూర్యాపేటకు చెందిన ఒక బాబు గవ్వ మింగారు. ఖమ్మం నగరానికి చెందిన 5 సంవత్సరాల బాబు తాళం కప్ప మింగగా ఎలాంటి ఆపరేషన్ లేకుండా దానిని బయటకు తీశారు. ఖమ్మంలోని డాక్టర్ జంగాల సునీల్ కుమార్ ఎండోస్కోపీ ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేశారు. ఈ వార్తను టీవీ9 ఇస్మార్ట్ వార్తల్లో చూసిన బాధితులు జంగాల సునీల్ కుమార్ దగ్గరకు క్యూ కడుతున్నారు.
ఇలా మూడు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడుకు చెందిన పది నెలల విరాట్ ఆడుకుంటూ పిన్నిసు మింగాడు. గతంలో ఇస్మార్ట్‌లో వచ్చిన వార్తలు చూసిన బాబు తండ్రి వెంటనే ఖమ్మంలోని జంగాల సునీల్ కుమార్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన డాక్టర్ ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపీ ద్వారా పిన్నిసు తీసి బాబును ప్రాణాపాయం నుండి కాపాడాడు. అతి తక్కువ ఖర్చుతో బాబు ప్రాణాలు కాపాడిన డాక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు తల్లిదండ్రులు.
ఇలా వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో.. పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకుని ఖమ్మంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలను ఎలాంటి ఆపరేషన్ లేకుండా మింగిన వస్తువులను బయటకు తీస్తున్నారు. డాక్టర్ వద్దకు తరచూ ఇలాంటి కేసులు వస్తున్న నేపథ్యంలో పిల్లలు ఆడుకునే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాంటి వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..