Heat wave: తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

Heat wave: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో ఏప్రిల్‌ 1,.2 తేదీల్లో ఎండలు తీవ్రతరం కానున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముందుముందు...

Heat wave: తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
Heat Wave
Follow us
Subhash Goud

|

Updated on: Apr 01, 2021 | 10:15 AM

Heat wave: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో ఏప్రిల్‌ 1,.2 తేదీల్లో ఎండలు తీవ్రతరం కానున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముందుముందు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి. అయితే అకస్మాత్తుగా ఎండలు పెరగడానికి గల కారణం.. హీట్‌వేవే. మనకు రాజస్థాన్‌ ఎండారి చాలా దూరంలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి వేడి గాలులు ఇక్కడి వరకు వ్యాపిస్తున్నాయి. పైగా వాటిలో వేడి ఏ మాత్రం తగ్గదు. క్రమ క్రమంగా వేడి గాలులు ఇక్కడికి వ్యాపించడం వల్ల రాత్రింబవళ్లు కూడా వేడి తగ్గడం లేదు. అయితే ఏప్రిల్‌లో మధ్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు ఉండబోతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే తెలంగాణలో 24 జిల్లాల్లో ఎండలు పెరుగుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు తెలంగణలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు, పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందువల్ల సరాసరి ఉష్ణోగ్రత 20 నుంచి 27 డిగ్రీల సెల్సియస్‌గ మాగ్జిమం ఉష్ణోగ్రత 38 నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాగల రెండు రోజుల్లో వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు. ఏప్రిల్‌ 1న 113 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీయనున్నాయని, 217 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు.

ఏప్రిల్‌ 1న తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఎక్కువగా ఉన్న మండలాలు

గుంటూరులో 29, కృష్ణాలో 27, విజయనగరం 19, విశాఖపట్నం 10. అలాగే ఏప్రిల్‌ 2న 148 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 207 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని అన్నారు.

ఏప్రిల్‌ 2న తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఎక్కువగా ఉన్న మండలాలు

గుంటూరులో 33, కృష్ణాలో 24, పశ్చిమ గోదావరి లో 18, విజయనగరం 18, తూర్పు గోదావరి లో 16, విశాఖపట్నం 15, శ్రీకాకుళం 10 మండలాలున్నాయి. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ జిల్లా యాంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కాగా, ఎండలు తీవ్రతరం కానున్న నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆయన సూచించారు. దాహం అనిపించకపోయినా.. ఎక్కువగా నీళ్లు తాగుతుండాలని అన్నారు. అలాగే వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవీ చదవండి: Central Government: నేటి నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి రానున్న ఒకే దేశం.. ఒకే పర్మిట్‌ విధానం

 Assam Election 2021 2nd Phase Voting LIVE: అసోంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు రెండో విడత పోలింగ్‌