AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC Exams 2023: అయ్యో దేవుడా..! పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి.. అంతలోనే తండ్రి మరణ వార్త విని..

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులతో సందడి నెలకొంది. ఏపీలో ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో పరీక్షా కేంద్రాలకు పరుగులు పెట్టారు విద్యార్థులు.. అటు తెలంగాణలో పరీక్ష సార్ట్ అయిన 5 నిమిషాల వరకూ అనుమతి ఉండడంతో ..

SSC Exams 2023: అయ్యో దేవుడా..! పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి.. అంతలోనే తండ్రి మరణ వార్త విని..
Nirmal
Shaik Madar Saheb
|

Updated on: Apr 03, 2023 | 11:53 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులతో సందడి నెలకొంది. ఏపీలో ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో పరీక్షా కేంద్రాలకు పరుగులు పెట్టారు విద్యార్థులు.. అటు తెలంగాణలో పరీక్ష సార్ట్ అయిన 5 నిమిషాల వరకూ అనుమతి ఉండడంతో ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అధికారులు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే, పదో తరగతి పరీక్షల వేళ.. ఓ విషాద ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎగ్జామ్‌ రాసేందుకు ఓ విద్యార్థి పుట్టెడుదుఃఖాన్ని దిగమింగి ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చాడు. ఎందుకంటే ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన ఆ విద్యార్థికి తన తండ్రి మరణ వార్త తెలిసింది.

అయినప్పటికీ.. ఆ విద్యార్థి తండ్రి చనిపోయిన దుఃఖంలోనే ఎగ్జామ్‌ రాసేందుకు హాజరయ్యాడు..ఈ ఉదయం తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు.. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో జరిగింది.

ఇదిలాఉంటే.. అనంతపురం జిల్లాలోనూ మరో విద్యార్థి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది..టెన్త్ ఎగ్జామ్ సప్లిమెంటరీ రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలైయ్యాయి. స్థానికులు ఇద్దరిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి గాయాలతో బయటపడ్డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..