AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC paper leak case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌లీక్‌ కేసులో అసలు ట్విస్ట్‌ ఇదే.. రూ.40 లక్షల బేరానికి మూడు ఏఈ పేపర్లు లీక్..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్‌ ఇప్పటికే వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 15 మందిని నిందితులను విచారిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ నిందితుల విచారణలో తాజాగా కీలక అంశాలు వెలుగులోకి..

TSPSC paper leak case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌లీక్‌ కేసులో అసలు ట్విస్ట్‌ ఇదే.. రూ.40 లక్షల బేరానికి మూడు ఏఈ పేపర్లు లీక్..
TSPSC paper leak case
Srilakshmi C
|

Updated on: Apr 03, 2023 | 11:15 AM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్‌ ఇప్పటికే వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 15 మందిని నిందితులను విచారిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ నిందితుల విచారణలో తాజాగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పేపర్‌ లీక్‌లో కేతావత్‌ రాజేశ్వర్‌ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. తొలుత ప్రవీణ్‌ కుమార్‌ ద్వారా రేణుకకు రూ. 10 లక్షలకు ఏఈ పేపర్‌ లీక్‌ అయ్యింది. నమ్మకమైన వారికి పేపర్‌ అమ్మాలని రేణుకకు సూచించాడు. అడ్వాన్స్‌ కింద రేణుక వద్ద నుంచి ప్రవీణ్‌ అడ్వాన్స్‌గా రూ. 5 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రేణుక తన భర్త డాక్యానాయక్‌ ద్వారా పేపర్లను అమ్మకానికి పెట్టింది. వీరి సమీప బంధువైన రాజేశ్వర్‌కు పేపర్‌ అమ్మకం బాధ్యతలు అప్పగించారు.

మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్‌ రూ.40 లక్షలకు గోపాల్‌, నీలేష్‌, ప్రశాంత్‌, రాజేంద్రకుమార్‌లకు అమ్మాడు. ముందుగా అడ్వాన్స్‌ కింద రూ. 25 లక్షలను పుచ్చుకున్న రాజేశ్వర్‌ మిగిలిన నగదును పరీక్షల అనంతరం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌ కింద తీసుకున్న పాతిక లక్షల్లో రూ.10 లక్షలు డాక్యానాయక్‌కు రాజేశ్వర్‌ ఇచ్చాడు. దానిలో నుంచి మరో రూ.5 లక్షలను ప్రవీణ్‌కు డాక్యా నాయక్‌కు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజేశ్వర్‌ తల్లి సర్పంచ్‌ కావడం చేత రూ.8 లక్షలతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చాక సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చని తల్లీకొడుకులు కూడబలుక్కున్నారు. సిట్‌ విచారణలో ఇదంతా బయటపడటంతో నిందితుల నుంచి రూ. 8.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా