Etela Rajender: మునుగోడులో ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. పలివెలలో పరిస్థితి ఉద్రిక్తం
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగింపు పర్వానికి చేరింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై దాడి జరిగింది.

నల్లగొండ జిల్లాలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగింపు పర్వానికి చేరింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఈటల రాజేందర్ ప్రచారం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో పలివెలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా.. ఈ ఘటనపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. చోద్యం చూస్తున్నారా అంటూ పోలీసులపై ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు. కావాలనే రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఇరువర్గాలు ప్రచారం చేస్తున్న క్రమంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఇరువర్గాలు కర్రలతో, రాళ్లతో దాడి చేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో ఇరువర్గాల కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పరస్పర దాడులతో పలివెలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. పలివెల ఘటనపై ఎన్నికల కమిషన్ సిరియస్ అయింది. పలివెలకు వెంటనే.. అదనపు బలగాలను పంపాలని ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
Also Read:
Minister KTR: బీజేపీ మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు