Sowmya Reddy: పట్టుదలతో ప్రయత్నించింది.. అనుకున్నది సాధించింది..కన్నవారికి పేరు తెచ్చిపెట్టింది!
తెలంగాణలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని తన అత్యుత్తమ ఆట తీరుతో తెలంగాణకు బేస్ బాల్‌లో రాష్ట్రానికి మెడల్ తీసుకొచ్చింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం జంగాపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి సౌమ్యరెడ్డి థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఇంటర్నేషనల్ బేస్ బాల్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి తన సొంత గ్రామానికి, రాష్ట్రానికి పేరు తెచ్చి పెట్టింది.

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం జంగాపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి, కవిత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు సౌమ్య రెడ్డి.. చిన్న కూతురు మాధురి. సౌమ్య రెడ్డి హైదరాబాదులోని గుడ్ సెండ్ హైస్కూల్లో ఇంటర్ వరకు చదివి, నల్గొండలో బీపీడి పూర్తి చేసింది. ఆటల పట్ల మక్కువ, బేస్‌బాల్ పట్ల ఆసక్తితో హైదరాబాద్ పీజీ గ్రౌండ్లో బేస్ బాల్ కోచింగ్ తీసుకుంది. మొట్ట మొదటిసారిగా కర్నూల్‌లో జరిగిన బేస్‌బాల్ పోటీల్లో పాల్గొంది. సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి నేషనల్స్ ఆడుతూ బేస్ బాల్‌పై గ్రిప్ పెంచుకుంది.

ఆటలో తనదైన ప్రతిభ కనబరుస్తూ ఏకంగా బ్యాంకాక్‌లో ఏషియన్ క్యాప్ 2025 ఇంటర్నేషనల్‌లో బేస్ బాల్ పోటీలకు సెలెక్ట్ అయ్యింది. వేరే రాష్ట్రంలో జట్టుతో కలిసి ఈ పోటీల్లో పాల్గొన్న సౌమ్య రెడ్డి ఏషియన్ క్యాప్ 2025 ఇంటర్నేషనల్‌లో బేస్‌బాల్‌లో సిల్వర్ మెడల్ సాధించింది.దీంతో రాష్ట్రానికి, గ్రామానికి పేరు తెచ్చిపెట్టిన సౌమ్య రెడ్డిని తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
బేస్‌బాల్‌లో సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా సౌమ్య రెడ్డి మాట్లాడుతూ తన అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తూ ఎంతో కష్టపడి తనకు హైదరాబాదులో చదివించారని..బేస్‌బాల్‌పై తనకున్న ఆసక్తి చూసి కోచింగ్ ఇప్పించారని చెప్పుకొచ్చింది. తాను ఇంటర్నేషనల్ స్థాయి పోటీల్లో గెలుపొందే విధంగా తీర్చిదిద్దిన గురువులకి, తన తల్లిదండ్రులకి రుణపడి ఉంటాను సౌమ్య రెడ్డి అన్నారు. అంతేకాకుండా ఇలాంటి ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడి స్వర్ణ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రానికి, గ్రామానికి పేరు తెచ్చి పెడతానని సౌమ్య రెడ్డి చెప్పుకొచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
