
కామారెడ్డి జిల్లా లొ దారుణం జరిగింది.ఎర్రోళ బాలయ్య అనే కసాయి కుమారుడు కన్న తల్లిని మంజీర నదిలో తోసేసి హత్య చేశాడు.తల్లినీ బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చూయిస్తానని తీసుకువచ్చి బాన్సువాడ పరిసర ప్రాంతంలో ఉన్న మంజీర నదిలో తోసేసి హైదరాబాద్ ఫరారయ్యాడు. మంజీర నదిలొ గుర్తు తెలియని వృద్ధురాలి శవం దొరికిందని పిట్లం పోలీసులు ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.బాన్సువాడ మండలం బొర్లం గ్రామస్థురాలనీ గుర్తించి బొర్లం గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతురాలు సాయవ్వను కొడుకు అతని తో పాటు మరో బాలుడు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీని ఆధారంగా పోలీసులు విచారించగా మరో బాలుడు సహాయంతో బైక్ పై తీసుకెళ్లి మంజీర లో తల్లిని తోసేసినట్లు పోలీసులు నిర్ధారించి, ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యువకుడు మైనర్ అని డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి తెలిపారు.
తనకు ఏమీ తెలియదని మైనర్ బాలుడు పోలీసులతో చెప్పాడు..ఆసుపత్రికి తీసుకెళ్దాం అనటంతో వృద్ధురాలు ఆశ తన బైక్ పై అతికష్టం మీద కూర్చుందని, నదిలో తోసేపుడు కూడా వేడుకుందని బాలుడు పోలీసులకు వెల్లడించాడు. తల్లి అనారోగ్యంతో ఉండటంతో పడుకున్న చోటే మల,మూత్ర విసర్జన చేసుకుంటుండటంతో దుర్వాసన వస్తుందని తల్లి నీ చంపినట్లు కొడుకు బాలయ్య అంగీకరించినట్టుగా పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ ఘటన దురదృష్టమని గ్రామంలో చర్చించుకుంటున్నారు. బాలయ్య భార్య గతంలో ఆత్మహత్య చేసుకుంది..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..