Cheapest Gold: బంగారం ప్రపంచంలోనే ఈ దేశంలో అతి చౌక..! దీనికి కారణం ఏంటంటే..
పసుపు లోహం అని పిలువబడే బంగారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, సురక్షితమైన పెట్టుబడులలో ఒకటి అని మనందరికీ తెలుసు. అందుకే దీనికి ఎల్లప్పుడూ అధిక డిమాండ్ ఉంటుంది. దీనివల్ల ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ఈ మెరిసే లోహం ధర ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రపంచంలోనే అత్యంత చౌకైన బంగారం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? సరసమైన బంగారం విషయానికి వస్తే చాలా మంది దుబాయ్ లేదా మధ్యప్రాచ్య దేశాల గురించి ఆలోచిస్తారు. కానీ

ప్రపంచంలో బంగారం కొనడానికి దుబాయ్ అత్యంత చౌకైన ప్రదేశం అని మీరు అనుకుంటే, ఇప్పుడు ఈ అవగాహన మారవచ్చు. వాస్తవానికి బంగారం ధరలు చవకగా లభించే కొన్ని దేశాలు ఉన్నాయి. దుబాయ్ కంటే తక్కువ ధరకు బంగారం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా..? అవును, ప్రపంచంలోని కొన్ని దేశాలలో బంగారం చౌకగా లభిస్తుంది..చౌకైన బంగారం లభించే జాబితాలో ఏ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి..? అక్కడ బంగారం ఏ ధరకు అమ్ముడవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
బంగారం ఒక విలువైన లోహం ప్రపంచవ్యాప్తంగా ధర మారుతూ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ప్రస్తుతం బంగారం అత్యంత సరసమైన ధరకు లభిస్తుంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8,586, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7,874లుగా ఉంది. ఈ ధర ఇతర దేశాల కంటే కొంచెం తక్కువగా ఉంది. దీని కారణంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది.
బంగారం కొనుగోలు విషయంలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8602 కు, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7889 కు లభిస్తుంది. ఇక్కడ బంగారం డిమాండ్ స్థిరంగా ఉన్నప్పటికీ, ధరలు సమతుల్యంగా ఉన్నాయి. ఇక, ఆసియాలో ప్రముఖ ఆర్థిక కేంద్రమైన సింగపూర్‌లో కూడా బంగారం చౌకగా లభిస్తుంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8667, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7949 చొప్పున అమ్ముడవుతోంది.
బంగారం స్వచ్ఛత, సురక్షితమైన పెట్టుబడికి ప్రసిద్ధి చెందిన స్విట్జర్లాండ్ కూడా ఈ జాబితాలో ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8682 చొప్పున, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 7963 చొప్పున అమ్ముడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్విట్జర్లాండ్ బంగారం దాని నాణ్యతకు అత్యంత నమ్మదగినదిగా పరిగణిస్తారు.
ఆగ్నేయాసియాలో పెద్ద దేశమైన ఇండోనేషియా కూడా చౌకగా బంగారం లభించే దేశాలలో ఒకటి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8704, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7983 ధరకు లభిస్తుంది. దుబాయ్‌లో జనవరి 2025 వరకు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8718, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.7996గా ఉంది.
భారతదేశానికి పొరుగున ఉన్న భూటాన్‌లో బంగారం ధరలు అతి తక్కువ. సున్నా పన్నులు, తక్కువ దిగుమతి సుంకాల కారణంగా భూటాన్‌లో ప్రపంచంలోనే బంగారం ధర చౌక. భారతీయులు భూటాన్‌లో దుబాయ్ కంటే 5-10శాతం తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








