AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తరుచుగా వచ్చే నోటి పుండుకు ఇదే కారణం..! ఈ చిట్కాలు పాటిస్తే ఈజీగా ఉపశమనం..

ఇది నోటి లోపల ఏర్పడే పుండు. ఇది అంత ప్రమాదకరం కానప్పటికీ, అది కలిగించే నొప్పి మాత్రం భరించలేనిదిగా ఉంటుంది. నోటిలోపల చర్మంపై, గొంతులోల, దవడల చర్మంపై, స్కిన్ రాషెస్ కు అవకాశం ఉన్న ఇతర ప్రదేశాల్లో ఈ పుండ్లు ఏర్పాడుతుంటాయి. అయితే, ఇలా నోటి పుండు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

తరుచుగా వచ్చే నోటి పుండుకు ఇదే కారణం..! ఈ చిట్కాలు పాటిస్తే ఈజీగా ఉపశమనం..
Mouth Ulcers
Jyothi Gadda
|

Updated on: Sep 14, 2025 | 1:00 PM

Share

నోటి పూత దీనినే నోటి పుండు లేదా మౌత్ అల్సర్ అని కూడా అంటూ ఉంటారు.. ఇది నోటి లోపల ఏర్పడే పుండు. ఇది అంత ప్రమాదకరం కానప్పటికీ, అది కలిగించే నొప్పి మాత్రం భరించలేనిదిగా ఉంటుంది. నోటిలోపల చర్మంపై, గొంతులోల, దవడల చర్మంపై, స్కిన్ రాషెస్ కు అవకాశం ఉన్న ఇతర ప్రదేశాల్లో ఈ పుండ్లు ఏర్పాడుతుంటాయి. అయితే, ఇలా నోటి పుండు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

అన్నం తినేటప్పుడు నాలుక కొరకడం, గాయాలు వల్ల నోటి పూత వస్తుంది. కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల నోటి పూత వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు సిట్రస్‌ పండ్లు తినడం వల్ల కూడా నోటి పూత రిస్క్‌ పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్‌ అందకపోవడం వల్ల కూడా నోటి పుండు వస్తుంది. ముఖ్యంగా ఐరన్‌, జింక్‌, విటమిన్ బి9, బి12 లోపిస్తే నోటి పూత వస్తుంది.

బాడీలో హార్మోన్ల మార్పుల వల్ల కూడా నోటి పూత వస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్‌ టైంలో, గర్భవతిగా ఉన్నప్పడు హార్మోన్ల అసమతుల్యత ఉంటుంది. దీని వల్ల నోటి పుండు వస్తుంది. ఒత్తిడి పలు సమస్యలకు కారణం అవుతుంది. ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒత్తిడి పెరగడం వల్ల నోటి పుండ్లు వస్తాయి. ఒక గ్లాసు వేడి నీటిలో ఒక చెంచా ఉప్పు నీరు కలిపి పుక్కిలించండి. ఇలా ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల నోటి పుండు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

* బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్ తయారు చేయాలి. దీన్ని నేరుగా నోటి పుండు ఉన్న దగ్గర అప్లై చేయండి. దీని వల్ల నోటి పూత తగ్గుతుంది.

* తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి, నోటి పూత ఉన్న దగ్గర నేరుగా తేనె అప్లై చేయడం వల్ల నోటి పూత తగ్గుతుంది.

* కొబ్బరినూనెలో కూడా యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కొబ్బరి నూనెను నోటి పూత ఉన్న దగ్గర అప్లై చేస్తే మంట తగ్గుతుంది.

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.