ఆడవారిలో విటమిన్ బి12 తగ్గితే కన్పించే లక్షణాలు ఇవే..! నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు..
ట్యూనా చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిలో విటమిన్ బి12 కూడా లభిస్తుంది. ట్యూనా చేపలు తింటే ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది. విటమిన్ బి12తో ఫోర్టిఫైడ్ చేసిన ధాన్యాలు తినడం వల్ల బాడీలో విటమిన్ బి12 లోపం తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు. పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ సులభంగా అందుతాయి. విటమిన్ బి12 లోపం కూడా తగ్గుతుంది.

శరీరంలోని కణాలు ఆరోగ్యంగా పని చేయాలంటే విటమిన్ బి12 అవసరం. విటమిన్ బి12 డీఎన్‌ఏ సంశ్లేషణలో సాయపడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే మహిళలు నీరసంగా ఉంటారు. శరీరంలో విటమిన్ బి12 లోపించడం వల్ల ఎర్రరక్తకణాల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని వల్ల చర్మం పాలిపోయనట్లు, పసుపు రంగులో కన్పిస్తుంది. మహిళల్లో తరుచూ తలనొప్పి రావడం కూడా విటమిన్ బి12 లోపానికి సంకేతమే అంటున్నారు నిపుణులు.. విటమిన్ బి12 లోపిస్తే మైగ్రేన్ వస్తుంది.
విటమిన్ బి12 లోపం మహిళల్లో మానసిక సమస్యలకు కారణం అవుతుంది. బాడీలో విటమిన్ బి12 లోపించడం వల్ల డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. మహిళల్లో విటమిన్ బి12 లోపించడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా మలబద్దకం, అజీర్తి, కడుపు ఉబ్బరంతో బాధపడాల్సి వస్తుంది. విటమిన్ బి12 లోపించడం వల్ల ఏకాగ్రత సరిగా ఉండదు. మానసిక స్పష్టత లోపిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
విటమిన్ B12 సహాజంగా లభించాలంటే చేపలు తినమని నిపుణులు చెబుతున్నారు. ట్యూనా చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిలో విటమిన్ బి12 కూడా లభిస్తుంది. ట్యూనా చేపలు తింటే ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది. విటమిన్ బి12తో ఫోర్టిఫైడ్ చేసిన ధాన్యాలు తినడం వల్ల బాడీలో విటమిన్ బి12 లోపం తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు. పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ సులభంగా అందుతాయి. విటమిన్ బి12 లోపం కూడా తగ్గుతుంది.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








