AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పితృపక్ష వేడుకలు.. ఆడవాళ్లకు చీర గాజులు.. మగవారికి కండువా, మందుబాటిళ్లతో వాయినాలు..

ఒక కొత్తతరహా ఆచారం ప్రాచుర్యంలోకి వచ్చింది .శ్రావణమాసం తర్వాత వచ్చిన పితృపక్షాలను కీడు దినాలుగా భావిస్తూ గ్రామ మహిళలందరూ గాజులు చీరలు మార్చుకొంటుంటే మగవారు టవాళ్లతో పాటు మందు బాటిళ్లను ఇచ్చి పుచ్చుకుంటున్నారు..సాంప్రదాయ బద్దంగా జరుగుతున్న ఈ ఆచారం పల్లెల్లో సందడి వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Watch: పితృపక్ష వేడుకలు.. ఆడవాళ్లకు చీర గాజులు.. మగవారికి కండువా, మందుబాటిళ్లతో వాయినాలు..
Post Shravan Tradition
Diwakar P
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 14, 2025 | 11:18 AM

Share

విభిన్నఆచారాలు,సంప్రదాయాలకు పెట్టింది పేరు నిజామాబాద్ జిల్లా..మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాలు అనుకొని ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతీ ఏటా కొత్త తరహా ఆచారాలు కనిపిస్తాయి..వాటిని తప్పకుండా పాటిస్తాయి సరిహద్దుల్లోని పల్లెలు..ఈసారి కూడా ఒక కొత్తతరహా ఆచారం ప్రాచుర్యంలోకి వచ్చింది .శ్రావణమాసం తర్వాత వచ్చిన పితృపక్షాలను కీడు దినాలుగా భావిస్తూ గ్రామ మహిళలందరూ గాజులు చీరలు మార్చుకొంటుంటే మగవారు టవాళ్లతో పాటు మందు బాటిళ్లను ఇచ్చి పుచ్చుకుంటున్నారు..సాంప్రదాయ బద్దంగా జరుగుతున్న ఈ ఆచారం పల్లెల్లో సందడి వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏ పల్లెలో చూసినా కొత్తరకం ఆచారం కనిపిస్తుంది..కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు తోబుట్టువులు ఇలా అందరూ ఎక్కడున్నా ఒక్క చోటుకు చేరుకుంటున్నారు..ఆడవాళ్లు గాజులు ,పసుపు కుంకుమలు,ఇచ్చి పుచ్చుకుంటున్నారు..మగవారు టవాలా మందుబాటిళ్లు ఇచ్చి పుచ్చుకుంటున్నారు..అంతే కాదు మేకలను కూడా బలి ఇస్తున్నారు..కుటుంబసాయులతో కలిసి అంత ఒక చోటుకు చేరుకొని చిన్న నాటి ఆటలను ఆడుతున్నారు..వృద్ధులు,మహిళలు సైతం ఉత్సాహంగా ఈ ఆచారంలో పాల్గొంటున్నారు..ఇంతకీ ఉన్నట్లుండి ఎందుకు ఈ కొత్త ఆచారం సందడి చేస్తుంది అనుకుంటున్నారా ?

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

శ్రవణం తర్వాత వచ్చే పితృ పక్షులను కీడు దినాలుగా భావిస్తారు ..ఈసారి వాటి వల్ల గ్రామాలకు అరిష్టం కలుగుతుందని ఇలా వింత ఆచారాన్ని కొనసాగిస్తే కీడు తొలిగిపోయి మంచి జరుగుతుందని భావిస్తున్నారు..అందుకే ఇపుడు ఈ ఆచారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లోని పల్లెల్లో వేగంగా విస్తరించింది..ఇది ఒక మూడ నమ్మకం అని కొంతమంది భావిస్తున్నారు..

వీడియో ఇక్కడ చూడండి..

ఏదైతే ఏంటి బిజీ లైఫ్ ను పక్కనబెట్టి ఆత్మీయులు,తోబుట్టువులు,స్నేహితులు,బంధువులు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు..ప్రతి ఏట శ్రావణ మాసం తర్వాత ఇదో ఒక కొత్త ఆచారం పుట్టుకురావడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..