బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు
తెలుగు రాష్ట్రాలను ఇప్పట్లో వరుణుడు వదిలేలా లేడు. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలోనే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీర ప్రాంతానికి సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకి ఉపరితల చక్రవాత ఆవర్తనం వాలి ఉందని వాతావరణశాఖ చెబుతోంది.
దీంతో పలు జిల్లాల్లో కుండపోత కురుస్తుందంటున్నారు. తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు అధికారులు. మరోవైపు ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుండపోత కురుస్తోంది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల పిడుగుపాటుకు నలుగురు మహిళలతో పాటు గేదెలు కూడా మృత్యువాత పడ్డాయి. కాలనీలన్నీ నీటమునగడంతో జనజీవనం స్తంభించి పోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దసరాకు దిమ్మతిరిగే న్యూస్.. తండ్రీ కొడుకుల పాన్ ఇండియా ఫిల్మ్
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
వామ్మో.. ఎంతకు తెగించార్రా? కదులుతున్న లారీపై చోరీ.. వస్తువులు కింద పడేస్తూ
Haryana: కోర్టుకి ఆలస్యంగా వచ్చిన ఇన్‌స్పెక్టర్.. జడ్జి ఏం చేశారో తెలుసా
Congo Boat Accidents: ఊహించని విషాదం.. 193 మంది జలసమాధి..! పెను విషాదం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

