AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana: కోర్టుకి ఆలస్యంగా వచ్చిన ఇన్‌స్పెక్టర్‌.. జడ్జి ఏం చేశారో తెలుసా

Haryana: కోర్టుకి ఆలస్యంగా వచ్చిన ఇన్‌స్పెక్టర్‌.. జడ్జి ఏం చేశారో తెలుసా

Phani CH
|

Updated on: Sep 14, 2025 | 4:15 PM

Share

హర్యానా కైథల్ జిల్లాలో గురువారం జిల్లా న్యాయస్థానంలో ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. హత్యకేసు విచారణలో భాగంగా హాజరైన ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్‌పకు కోర్టు లాకప్‌లో ఉంచాలని ఆదేశించింది. ఏం జరిగిందంటే... ఇన్‌స్పెక్టర్ రాజేష్, కోర్టులో ఓ హత్య కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా సాక్ష్యం చెప్పడానికి హాజరయ్యారు.

అయితే ఆయన కోర్టుకి అరగంట ఆలస్యంగా వచ్చాడు. 10 గంటలకు కేసు విచారణ ఉంటే ఆయన 10.30 గంటలకు కోర్టుకు రావడంతో అదనపు సెషన్ జడ్జి మోహిత్ అగర్వాల్ ఆయనను తీవ్రంగా తప్పుబట్టారు. విచారణకు ఆలస్యంగా వచ్చిన కారణంగా 10:30 నుంచి 11:30 లాకప్లో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఆయన జీతాన్ని కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఇన్‌స్పెక్టర్ రాజేష్ తరచూ కోర్టును అవమానించేలా మాట్లాడుతున్నారని, ఇది చట్టరీత్యా నేరం అని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాదు.. అతనిపై అంతకుముందే నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ఇదే విషయమై హైకోర్టు అప్పటికే 2024, డిసెంబర్ 10న కేసును త్వరగా ముగించాలని జిల్లా కోర్టును ఆదేశించింది. అయినప్పటికీ, ఇన్‌స్పెక్టర్ విచారణకు హాజరు కాకపోవడం వల్ల కేసు వాయిదా పడుతూ వచ్చింది. కోర్టు సమయాన్ని వృధాచేసినందుకుగాను ఈ కఠిన తీర్పును ఇవ్వాల్సి వచ్చింది. కోర్టు నియమ నిబంధనలను అతిక్రమించే ఎవరికైనా ఇలాంటి కఠిన చర్యలు తప్పవని న్యాయస్థానం హెచ్చరించింది. ఇన్‌స్పెక్టర్ రాజేష్ ప్రస్తుతం సిర్సా జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. 2021లో ఆయన కైథల్ జిల్లా సీవన్ పోలీస్‌స్టేషన్‌లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నప్పుడు, ఓ గ్రామంలో ఫిర్యాదుదారుడి మేనల్లుడు హత్యకు గురయ్యాడు. అయితే.. మృతుడి మామ కేసు విచారణలో ఆలస్యం జరుగుతోందని ఆరోపిస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణలో భాగంగా ఇన్‌స్పెక్టర్ రాజేష్ సాక్ష్యం చెప్పే నిమిత్తం కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, కేసు విచారణకు ఆలస్యంగా రావడం వల్ల ఇలా ముద్దాయిగా లాకప్‌లో గడపాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు లాకప్‌లో ఉంచిన అనంతరం ఇన్‌స్పెక్టర్ రాజేష్‌ను మళ్లీ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుపరిచి విచారణ అనంతరం విడుదల చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Congo Boat Accidents: ఊహించని విషాదం.. 193 మంది జలసమాధి..! పెను విషాదం

Gold Price: పసిడి ప్రియలకు ఊరట.. తులం ఎంతంటే

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు

అల్లు అర్జున్‌ నా డ్రీమ్ హీరో అమ్మో..రితికాది పెద్ద ప్లానింగే

Disha Patani: దిశా ఇంటిపై కాల్పులు జస్ట్ ట్రైలరే అంటున్న గోల్డీ బ్రార్