ఇన్ని తెలివితేటలు ఏంటి భయ్యా.. మీ బైక్‌ను ఎవరూ కొట్టేయలేరు
ఇటీవల దొంగలు ఎక్కువగా బైక్ దొంగతనాలు చేస్తున్నారు. రోడ్డు పక్కన, ఇంటి బయట పార్క్ చేసిన బైక్‌లను టార్గెట్ చేస్తున్నారు. హ్యాండిల్ లాక్ చేసినా కూడా సైలెంట్‌గా ఎవరికీ అనుమానం రాకుండా సులభంగా ఎత్తుకెళ్లిపోతున్నారు. బైక్ దొంగతనాలను నివారించడానికి ఓ వ్యక్తి అద్భుతమైన ట్రిక్‌ను వెల్లడించాడు. అతని జుగాడ్ ట్రిక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోను తక్కువ టైమ్‌లో 60 లక్షల మందికి పైగా వీక్షించారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి బైక్ దొంగతనాన్ని నివారించడానికి ఓ సీక్రెట్ ట్రిక్ చెప్పాడు. ముందుగా బైక్ హ్యాండిల్‌ను, బ్రేక్‌ను కలుపుతూ ఓ గుండ్రటి స్టీల్ రింగ్ పోనిచ్చాడు. ఆ తర్వాత ఆ రింగ్‌కు, బ్రేక్‌కు కలిపి తాళం కప్ప వేశాడు. దీంతో ఎవరైనా బైక్ స్టార్ట్ చేసినా, దానిని తీసుకెళ్లడం సాధ్యం కాదు. స్టార్ట్ చేసినపుడు పెద్ద శబ్దం వస్తుంది. ముందుకు కదలదు. ఈ ట్రిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆ వీడియోలో వివరించాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమ రియాక్షన్స్ తెలియజేశారు. అతడి తెలివికి సలాం చెప్పాల్సిందేనని ఒకరు ప్రశంసించారు. ఈ ట్రిక్ వల్ల అంత పెద్ద ఉపయోగం ఉండదని మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చలికాలంలో వెచ్చదనం, మండే ఎండల్లో కూల్.. ఈ ఇంటి డిజైన్ చూసారా?
ఆ దీవిలో అడుగు పెడితే చంపేస్తారు!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!

