AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం.. ఐదు రంగుల నదిని చూసారా?

అద్భుతం.. ఐదు రంగుల నదిని చూసారా?

Phani CH
|

Updated on: Sep 14, 2025 | 1:21 PM

Share

సాధారణంగా నదులు స్వచ్ఛమైన నీటితో గలగల పారుతుంటాయి. వర్షం కారణంగా వరద నీరు కలిసి కొన్ని ప్రాంతాల్లో ఎరుపు రంగును సంతరించుకుంటాయి. కానీ కొలంబియా దేశంలోని ఈ నది మాత్రం ఏకంగా ఐదు రకాల రంగులతో ప్రవహిస్తుంది. ఈ నది పేరు కానో క్రిస్టేల్స్. ఈ నదిలో నీరు ఆకుపచ్చ, నీలం, పసుపు, నలుపు, ఎరుపు ఇలా ఐదు వేర్వేరు రంగులలో కనిపిస్తుంది.

అయితే జూలై నుంచి నవంబర్ వరకు మాత్రమే నది నీరు ఐదు రంగుల్లో కనిపిస్తుంది. అందుకే ఈ నెలల్లో చాలా మంది ఈ నదిని చూడానికి వెళతారు. ఇది దాదాపు 62 మైళ్ల పొడవు 65 మైళ్ల వెడల్పు ఉన్న నది. నది అట్టడుగున ప్రత్యేకమైన రాళ్లపై పేరుకున్న ఓ ప్రత్యేక నాచు కారణంగానే నదికి ఈ రంగులొచ్చాయని శాస్త్రవేత్తలు అంటుంటారు. నదికి ఉన్న అతి గొప్ప లక్షణం ఏంటంటే… ఈ నది నీటిలో ప్రమాదకరమైన చేపలు లేదా జీవులు కనిపించవు. నది ఉపరితలంలో మాసిరినియా క్లావిగెరా అనే మొక్క ఎరుపు రంగుకి కారణం అవుతోంది. సూర్యకాంతితో అది ఎర్రగా మారుతుందని, అందుకే నీరు ఎర్రగా కనిపిస్తుందని చెబుతారు. కొలంబియాలోని ఈ ప్రత్యేకమైన నదిని ‘రెయిన్‌బో రివర్’ లేదా ‘ఈడెన్ గార్డెన్ అంటే ‘గార్డెన్ ఆఫ్ ది గాడ్స్’ అని కూడా పిలుస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈరోజు నుంచి ప్రజాక్షేత్రంలోకి టీవీకే పార్టీ అధినేత

కూకట్‌పల్లి మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్

యాదాద్రి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

‘బోటిం’ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు చేపట్టిన విజయ్ ఓలేటి

ప్రపంచ యాత్రకు మహిళా సాహసికులు!