AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో వెచ్చదనం, మండే ఎండల్లో కూల్.. ఈ ఇంటి డిజైన్‌ చూసారా?

చలికాలంలో వెచ్చదనం, మండే ఎండల్లో కూల్.. ఈ ఇంటి డిజైన్‌ చూసారా?

Phani CH
|

Updated on: Sep 14, 2025 | 1:33 PM

Share

ఈ మట్టి ఇల్లు ఎన్నో ప్రత్యేకతలతో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రదర్శనకు ఉంచడంతో దాన్ని చూడటానికి ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు నగర శివారు ప్రాంతం మేట్టుపాళయంలో ఈ ఇల్లుంది. కిందపడిన నీటి బిందువులా వంపులు తిరిగిన ఈ నిర్మాణం.. పర్యావరణహితమైన 2 బీహెచ్‌కే ఇల్లుగా తమిళనాడు ప్రభుత్వ ప్రశంసలు అందుకుంది.

తోటల మధ్య 1,450 చదరపు అడుగుల్లో దీన్ని నిర్మించారు. ఈ ఇంటిని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్‌లు పెచ్చిముత్తు కెన్నెడీ, శివానీ శరణ్‌కు గ్రామీణ వాతావరణం అంటే మహా ఇష్టం. ఇల్లు అనేది ప్రకృతికి, పర్యావరణానికి మనిషిని దగ్గర చేసేలా ఉండాలని బలంగా నమ్ముతారు. అందుకే పర్యావరణ అనుకూలమైన మట్టి ఇళ్ల నిర్మాణంపై చాలా ఏళ్లపాటు అధ్యయనం చేశారు. ఇందులో గుర్తించిన అంశాల ఆధారంగా తమ స్థలంలో 2BHK మట్టి ఇంటిని డిజైన్‌ రెడీ చేశారు. సాధారణంగా ఇంటిని నిర్మించే ముందు భూమిని చదును చేస్తారు. అందులో మట్టిని నింపుతారు. భూమిని ఒక సమతల పొరగా మారుస్తారు. కానీ ఈ ఆర్కిటెక్ట్‌లు తమ మట్టి ఇంటి నిర్మాణానికి భూమిని చదును చేయించలేదు. అసమానంగా, ఎత్తుపల్లాలతో ఉన్న భూమిపైనే తాము రెడీ చేసిన డిజైన్ ప్రకారం ఇంటిని నిర్మించారు. గుహలాంటి ద్వారంలోంచి వెళ్తే లోప గుండ్రని పైకప్పుతో విలాసవంతమైన గదులు స్వాగతిస్తాయి. ఇల్లు మధ్యలో లాన్‌ ఉండటంతో ఏ గదికి వెళ్లినా పచ్చదనం పలకరిస్తుంది. కావాల్సినంత వెలుతురు, గాలి వస్తున్నాయి. ఇంట్లో వేడి బయటికెళ్లేలా రూఫింగ్‌కు కవాటాల్లాంటి నిర్మాణాలున్నాయి. పిల్లర్లు వేయలేదు. సన్నని ఇనుప జాలీ మెష్‌కి ఫెర్రోసిమెంట్‌ పూత పూసి.. నాలుగున్నర అంగుళాల మందం వచ్చేలా జాలీని మడతపెట్టారు. ఈ జాలీనే గోడలకి పైకప్పుగా వాడారు. దీనిపై రెండు వైపులా బురదను పూశారు. మట్టి వల్ల లోపలి ఉష్ణోగ్రత బయటితో పోల్చితే 3 డిగ్రీలు తక్కువ ఉంటోంది. ఈ ఇంట్లో ఉంటే పర్వతాల్లో తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుందనీ మండే ఎండల్లోనూ ఈ ఇల్లు కూల్‌గా ఉంటుందనీ ఆర్కిటెక్ట్‌లు తెలిపారు. ఏసీ అవసరమే ఉండదనీ శీతాకాలంలో ఈ ఇల్లు వెచ్చగా ఉంటుందనీ అన్నారు. మట్టి ఇల్లు కూడా బలంగా నిలవగలదని ఈ ఇల్లు నిరూపించిందని ఈ అద్భుతమైన కలల ఇంటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ దీవిలో అడుగు పెడితే చంపేస్తారు!

ఉపవాసంతో గుండె వ్యాధుల ముప్పు 135% ఎక్కువట

అద్భుతం.. ఐదు రంగుల నదిని చూసారా?