AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు

Phani CH
|

Updated on: Sep 14, 2025 | 3:07 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. ఉత్త­రాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి బంగాళాఖాతంలో అల్ప­పీడనం ఏర్పడింది. చత్తీస్గడ్ విదర్భ ల మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్రమట్టం నుండి 5.8 కిమీ మధ్యలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

ఈ క్రమంలో శనివారం 5 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. మిగతా జిల్లాలలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. కాగా అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, తూర్పుగోదావరి జిల్లాల్లో శనివారం ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని సూచించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి తోడు అల్పపీడనం ఏర్పడటంతో ఇటు తెలంగాణలోనూ శని,ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్ వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం.. నిర్మల్, నిజామాబాద్,మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయగా మిగతా జిల్లాలలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లు అర్జున్‌ నా డ్రీమ్ హీరో అమ్మో..రితికాది పెద్ద ప్లానింగే

Disha Patani: దిశా ఇంటిపై కాల్పులు జస్ట్ ట్రైలరే అంటున్న గోల్డీ బ్రార్

ఈ రక్త పరీక్షతో.. 10 సం.ల ముందే బయటపడే క్యాన్సర్‌

Palm Jaggery: తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!

తగ్గుతున్న మనిషి ఆయుర్దాయం.. కారణం ఇదే