AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తగ్గుతున్న మనిషి ఆయుర్దాయం.. కారణం ఇదే

తగ్గుతున్న మనిషి ఆయుర్దాయం.. కారణం ఇదే

Phani CH
|

Updated on: Sep 14, 2025 | 1:53 PM

Share

భారతదేశంలో వాయుకాలష్యం ఏ రేంజ్‌లో పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. ఒకరకంగా ఈ కాలుష్యం పెరగడానికి కారణం మనిషే. అయినా దాని గురించి పట్టించుకునే సీనే లేదు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రెస్పికాన్ 2025 సదస్సులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజు రోజుకీ భారతదేశంలోని యువత ఆరోగ్యం క్షీణించడానికి కారణం వాయు కాలుష్యమేనని తేలింది.

వాయు కాలుష్యం వల్ల ముఖ్యంగా యువతలో అనేక రకాల శ్వాసకోస సమస్యలు, క్యాన్సర్‌ వంటి వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. చెడు గాలి, బయోమాస్ ఇంధనం వాడకం, స్మోకింగ్ వంటి కారణాల వల్ల యువతలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ టిబి రిపోర్ట్ 2024 ప్రకారం, 2022లో భారతదేశంలో ప్రతి లక్ష మందికి 199 కొత్త TB కేసులు నమోదయ్యాయి. అంతేకాదు న్యూమోనియా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. న్యుమోనియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది ఐదేళ్లు కంటే తక్కువ వయసున్న చిన్నారులు మరణిస్తున్నారు. అంతకంతకూ పెరుగుతున్నఈ కేసులకు కారణం వాయుకాలుష్యం, కలుషిత వాతావరణమేనని చెబుతున్నారు. వీటి ఎఫెక్ట్‌ ఎక్కువగా యువతపైనే ఉంటుందని, యువతలో అధికశాతం మందికి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ విషపూరితమైన గాలి కారణంగా భారతీయుల సగటు జీవితకాలం సుమారు 1000 రోజులు తగ్గిపోతుందని సమావేశంలో వెల్లడించారు. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 నివేదిక ప్రకారం, భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా ప్రజల సగటు ఆయుర్దాయం 1.5 నుండి 2 సంవత్సరాలు తగ్గుతోంది. యువత ఆరోగ్య భవిష్యత్తుపై ఇది ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అంటున్నారు. యువతలో ఊపిరితిత్తుల ఆరోగ్యం దారుణంగా క్షీణిస్తోందని, ఏటా సుమారు 81,700 కొత్త ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని చెప్పింది. ఇది పెను ప్రమాదానికి సూచన అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఊపిరితిత్తుల వ్యాధులు కేవలం వృద్ధులలో మాత్రమే కనిపించేవి, కానీ ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్, COPD, TB వంటి కేసులు యువతలో కూడా వేగంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Cancer Injection: ఒక్క ఇంజెక్షన్‌.. క్యాన్సర్‌ మాయం.. ఫలిస్తున్న పరిశోధనలు..

ఇన్ని తెలివితేటలు ఏంటి భయ్యా.. మీ బైక్‌ను ఎవరూ కొట్టేయలేరు

అలారం శబ్దంతో గుండెపోటు..!

చలికాలంలో వెచ్చదనం, మండే ఎండల్లో కూల్.. ఈ ఇంటి డిజైన్‌ చూసారా?

ఆ దీవిలో అడుగు పెడితే చంపేస్తారు!