వామ్మో.. ఎంతకు తెగించార్రా? కదులుతున్న లారీపై చోరీ.. వస్తువులు కింద పడేస్తూ
సినిమాల్లో కదిలే లారీలు, రైళ్లలోకి ఎక్కి చోరీలు చేసే సీన్లు చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్లు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ కనిపిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కదులుతున్న లారీ ఎక్కిన దొంగలు.. వస్తువులను చోరీ చేసిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు.
ఈ వీడియో చూసిన వారంతా.. వామ్మో ఎంతకు తెగిచార్రా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. కష్టపడకుండా సంపాదించాలనే ఆలోచనతో పలువురు ఈ బాట పడుతున్నారు. డబ్బులు, నగలు మాత్రమే కాకుండా ఫోన్లు, ల్యాప్టాప్లు ఇలా ఏది కనిపిస్తే దాన్ని దోచేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కదులుతున్న లారీపైకి ఎక్కారు. ముఖాలకు మాస్కులు ధరించిన వారిద్దరూ లోడ్‌తో వెళ్తున్న లారీలోని కొన్ని వస్తువులను దొంగిలించారు. తర్వాత వస్తువుల్ని కిందపడేసారు. రెండు బైకులపై ఆ లారీని అనుసరించిన వ్యక్తులు ఆ వస్తువులను సేకరించారు. తర్వాత వాటిని సమీప ప్రాంతాల్లో విక్రయిస్తుంటారట. వీరు చేస్తున్నది దొంగతనం అని తెలిసి కూడా దర్జాగా, ఎంతో సరదాగా చేసారు. పైగా వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేసారు. ధూమ్ సినిమా తరహా దోపిడీకి సంబంధించిన ఈ వీడియో క్లిప్ చూసి దర్యాప్తు చేసిన పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్-ధులే హైవేపై ఈ ఘటన జరిగింది. మీడియాకు వారిని చూపించారు. అయితే కదులుతున్న లారీ నుంచి వారు ఏ వస్తువులు చోరీ చేశారు అన్నది బయటపెట్టలేదు. హైవే పై జరుగుతున్న ఇలాంటి మరిన్ని దొంగతనాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Haryana: కోర్టుకి ఆలస్యంగా వచ్చిన ఇన్‌స్పెక్టర్.. జడ్జి ఏం చేశారో తెలుసా
Congo Boat Accidents: ఊహించని విషాదం.. 193 మంది జలసమాధి..! పెను విషాదం
Gold Price: పసిడి ప్రియలకు ఊరట.. తులం ఎంతంటే
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు
అల్లు అర్జున్ నా డ్రీమ్ హీరో అమ్మో..రితికాది పెద్ద ప్లానింగే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

