AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

Phani CH
|

Updated on: Sep 14, 2025 | 4:20 PM

Share

రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రష్యా తూర్పు తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. ఈ శక్తిమంతమైన భూకంపం నేపథ్యంలో అధికారులు సమీప తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

యూఎస్‌జీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం కమ్చట్కా ప్రాంత పరిపాలనా కేంద్రమైన పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్స్కీ నగరానికి తూర్పున 111 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 39.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అప్రమత్తమైంది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని రష్యా తీర ప్రాంతాలపై ప్రమాదకరమైన అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, భూకంప తీవ్రతను యూఎస్‌జీఎస్ తొలుత 7.5గా అంచనా వేసినప్పటికీ, తరువాత దానిని 7.4కు సవరించింది. గత జులై నెలలో కూడా ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పసిఫిక్ అంతటా సునామీ అలలు ఎగసిపడటంతో హవాయి నుంచి జపాన్ వరకు పలు దేశాలు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఎంతకు తెగించార్రా? కదులుతున్న లారీపై చోరీ.. వస్తువులు కింద పడేస్తూ

Haryana: కోర్టుకి ఆలస్యంగా వచ్చిన ఇన్‌స్పెక్టర్‌.. జడ్జి ఏం చేశారో తెలుసా

Congo Boat Accidents: ఊహించని విషాదం.. 193 మంది జలసమాధి..! పెను విషాదం

Gold Price: పసిడి ప్రియలకు ఊరట.. తులం ఎంతంటే

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు